Badam Health Benefits: బాదాం హెల్త్ బెనిఫిట్స్.. జుట్టు నుంచి రక్త కణాల వరకు ఎన్నో లాభాలు

Health Benefits of Almonds: బాదాంతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు. రోజూ బాదాం తినే వారికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్యానికి సంబంధించిన అనేక పరిశోధనల్లో వెల్లడైంది. ప్రతీరోజూ ఉదయం బాదాం తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ కూడా చెబుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 1, 2023, 08:17 AM IST
Badam Health Benefits: బాదాం హెల్త్ బెనిఫిట్స్.. జుట్టు నుంచి రక్త కణాల వరకు ఎన్నో లాభాలు

Almonds Health Benefits: కరోనా వైరస్ వ్యాప్తి తరువాత జనంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. గతంతో పోలిస్తే.. ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్న వారి సంఖ్య భారీగానే పెరిగింది. ఎప్పుడు, ఎలాంటి వైరస్ దాడి చేస్తుందో, ఎలాంటి అనారోగ్యం వేధిస్తుందోననే ఆందోళనే అందుకు కారణం. జనానికి కరోనావైరస్, ఆ తరువాతి పరిణామాలు నేర్పిన గుణపాఠం ఇది. కరోనావైరస్ పరిణామాలు, ఆ తరువాత కరోనా పేషెంట్స్ ఎదుర్కొన్న సైడ్ ఎఫెక్ట్స్ చూశాకా అన్నింటికంటే ఆరోగ్యమే ముఖ్యం అనే విషయం యావత్ ప్రపంచానికి బోధపడింది. 

రోగ నిరోధకశక్తిని పెంచుకోవడం ద్వారానే కోవిడ్-19 లాంటి వైరస్‌ల బారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చునని ఎప్పటికప్పుడు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీంతో హెల్తీ ఫుడ్స్‌పై అందరీకీ అవగాహన పెరిగిపోయింది. మంచి పోషక విలువలు ఉండే ఆరోగ్యం తీసుకోవడానికే జనం ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటి ఆహారంలో బాదాం కూడా ఒకటి. బాదాం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో చాలా మంది ఎంచుకున్న హెల్తీ ఫుడ్స్ లో బాదం కూడా ఒకటి.

ప్రతీరోజూ ఉదయం బాదాం తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తకణాల సామర్థ్యం పెరిగి ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
బాదాం తింటే విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది. బాదాం మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి కొవ్వును నియంత్రిస్తుంది.
బాదాం తింటే మీకు కావాల్సినంత పొటాషియం లభిస్తుంది. ఇందులో సోడియం తక్కువ కనుక రక్తపోటు సమస్య అసలే ఉండదు. రక్తప్రసరణ మెరుగ్గా జరిగి గుండె సంబంధిత జబ్బులకు పరిష్కారం దొరికినట్లవుతుంది. 
ఉదయాన్నే బాదాం తినడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. బాదాంతో శరీరానికి కావలసిన ఐరన్ లభిస్తుంది. బాదాంలో ఉంటే మోనోశాచ్యురేటెడ్, పాలీశాచ్యురేటెడ్స్ శరీరంలో నిల్వ ఉండే చెడు కొవ్వులను నివారిస్తుంది.
అందుకే బాదాం తరచుగా తినేవారికి గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా తక్కువే అని పలు పరిశోధనలు చెబుతున్నాయి. 
బాదాంలో ఆరోగ్యానికి మేలు చేసే ఫ్యాట్స్, మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. 
తరచుగా బాదాం తినడం వల్ల మలబద్దకం సమస్యకు చెక్ పెట్టవచ్చు. 
ప్రతిరోజూ ఓ నాలుగైదు బాదాం పప్పులు నీళ్లలో నానబెట్టి, మరునాడు ఉదయాన్నే పొట్టు తీసుకుని తింటే జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది.

Trending News