Buttermilk: ప‌ర‌గ‌డుపున నీళ్లకు బదులుగా మజ్జిగ తాగ‌డం కలిగే ప్రయోజనాలు ఇవే..!

Buttermilk Benefits: వేసవి కాలంలో చాలా మంది చల్లదనం కోసం వివిధ రకాల పానీయాలు తాగ్గుతు ఉంటారు. కానీ వడదెబ్బ నుంచి రక్షణ పొందాలనుకునేవారు ఖచ్చితంగా చల్లని మజ్జిగను తాగకుండా ఉండరు. అయితే మజ్జిగను కేవలం వేసవిలోనే కాకుండా ప్రతిరోజు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 28, 2023, 10:27 PM IST
Buttermilk: ప‌ర‌గ‌డుపున నీళ్లకు బదులుగా మజ్జిగ తాగ‌డం కలిగే ప్రయోజనాలు ఇవే..!

Buttermilk Benefits: కొంతమంది ఉదయం నిద్రలేవగానే గోరువెచ్చని నీరు తాగడం అలవాటుగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే నీళ్లకు బదులుగా మజ్జిగను తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని చెబుతున్నారు. మజ్జిగ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఉదయం నిద్రలేవగానే మజ్జిగ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మజ్జిగలో ప్రొబయోటిక్‌ బ్యాక్టీరియా గుణాలు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. క‌డుపులో మంట‌, అల్స‌ర్, గ్యాస్, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లను త‌గ్గించ‌డంలో మ‌జ్జిగ ఎంతో స‌హాయ‌ప‌డుతుంది.

Also read: Winter Health Tips: చలికాలంలో గుండె ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షించుకోవాలి

అంతేకాకుండా మజ్జిగను పరగడుపున తీసుకోవడం వల్ల ప్రేగులు శుభ్రం ఉంటాయి. ఉదయం మజ్జిగను తీసుకోవడం కష్టం అనుకొనేవారు రాత్రి అన్నంలో కొంచెం మజ్జిగను తీసుకోవడం మేలు.  కేవలం పెరుగులో నీళ్లు కలిపిన మజ్జిగ కాకుండా కొంచెం మిరియాల పొడి, కరివేపాకు, కోతిమీరా ఇతర ఆకులు కలిపి తీసుకోవడం వల్ల ప్రయోజనలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

శ‌రీరంలో పేరుకుపోయిన వ్య‌ర్థ ప‌దార్థాలు తొల‌గించడంలో మజ్జిగ ఎంతో మేలు చేస్తుంది. మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా త‌యార‌వుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

Also read: Ajwain Leaves: వాము ఆకుతో న్యూమోనియా సమస్య నుంచి తక్షణ ఉపశమనం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News