Ginger Tea Benefits: వానా కాలంలో చాయ్‌కి బదులు ఈ టీ తాగితే బోలెడు లాభాలు..

Ginger Tea Benefits: వానా కాలంలో చాయ్‌కి బదులు ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ టీని తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు తీవ్ర వ్యాధులను సైతం తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. 

Edited by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 20, 2023, 06:13 PM IST
Ginger Tea Benefits: వానా కాలంలో చాయ్‌కి బదులు ఈ టీ తాగితే బోలెడు లాభాలు..

 

Ginger Tea Benefits: చాలా మందిలో వర్షం కారణంగా శరీరంలోని రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీని కారణంగా పొట్ట, చర్మం, గొంతు, ఇతర ఇన్పెక్షన్స్‌ పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా చాలా మందిలో జలబు దగ్గుతో పాటు గొంతు నొప్పి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుంగా ఉండడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి పెంచేకోవడానికి అల్లం టీని తాగాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ టీని తాగడం వల్ల పై సమస్యలకు ఉపశమనం లభించడమేకాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ టీలో అతి మధురం పొడిని వినియోగించడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ టీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

అల్లం, అతి మధురం పొడి టీకి కావాల్సిన పదార్థాలు:
❋ 1/2 అంగుళం అల్లం ముక్క
❋ 1/2 అంగుళం అతి మధురం ముక్క
❋ 1/4 టీ స్పూన్‌ నల్ల మిరియాల పొడి 
❋ 2 కప్పులు నీరు
❋ 1/2 టీస్పూన్ తేనె
 
టీ తయారి పద్ధతి:
❋ ముందుగా ఈ టీని తయారు చేసుకోవడానికి 1/2 అంగుళం అల్లం, 1/2 అంగుళం అతి మధురం ముక్కలను తీసుకోవాల్సి ఉంటుంది.
❋ వీటిని స్టౌవ్‌పై మరిగించి మిరియాల పొడి వేసి బాగా మరిగించాలి.
❋ ఆ తర్వాత 1/2 టీస్పూన్ తేనె వేసి ఫిల్టర్‌ చేయాలి.
❋ ఇలా ఫిల్టర్‌ చేసిన తర్వాత సర్వ్‌ చేసుకుని తాగాలి.

Also Read: Heavy Rains: ఎడతెరిపి లేని భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు
 
అల్లం ప్రయోజనాలు:

❋ అల్లంలో శరీరానికి శక్తిని కలిగించే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అధిక పరిమాణంలో లభిస్తాయి. దీని కారణంగా జలుబు, ఫ్లూ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
❋ అనాల్జేసిక్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తాయి.
❋ అల్లం గొంతు నొప్పితో సహా అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

అతి మధురం పొడి ప్రయోజనాలు:
❋ అతి మధురం పొడిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కుగా ఉంటాయి. అంతేకాకుండా  రోగనిరోధక శక్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
❋ గొంతు ఇన్ఫెక్షన్లను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది.
❋ ఇందులో  విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి5 అధిక పరిమాణంలో లభిస్తాయి. 
❋ ఈ పొడి కాలేయ సమస్యలను తగ్గించేందుకు కూడా దోహదపడుతుంది.

Also Read: Heavy Rains: ఎడతెరిపి లేని భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News