Detox Water For Weight Loss: ఈ డిటాక్స్ వాటర్ శరీరానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా..!!

 Detox Water For Weight Loss: మన శరీరం నుంచి వ్యర్థాలను తొలగించడానికి డిటాక్స్ డ్రింక్స్ ఎంతో ఉపయోగపడతాయి. ఇవి జీవక్రియను మెరుగు పరచడాని కడుపులో ఉన్న సమస్యల నుంచి విముక్తి పొందేందుకు ఎంతో సహయపడతాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 17, 2022, 01:21 PM IST
  • డిటాక్స్ వాటర్ శరీరానికి చాలా మేలు చేస్తాయి
  • డిటాక్స్ వాటర్ బరువు తగ్గిస్తాయి
  • యాపిల్ డిటాక్స్ వాటర్‌తో శరీరాని ఎన్నో లభాలు
 Detox Water For Weight Loss: ఈ డిటాక్స్ వాటర్ శరీరానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా..!!

Detox Water For Weight Loss: మన శరీరం నుంచి వ్యర్థాలను తొలగించడానికి డిటాక్స్ డ్రింక్స్ ఎంతో ఉపయోగపడతాయి. ఇవి జీవక్రియను మెరుగు పరచడాని కడుపులో ఉన్న సమస్యల నుంచి విముక్తి పొందేందుకు ఎంతో సహయపడతాయి. శరీరంలో వ్యర్థాలను తొలగించేందుకు, శరీర అభివృద్ధికి పలు రకాల డిటాక్స్ వాటర్‌ను ఉపయోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతే కాకుండా బరువు తగ్గడానికి కూడా ఈ డిటాక్స్ వాటర్‌ సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలంటే ఏ వాటర్‌ను తాగలో తెలుసుకుందాం...

బరువు తగ్గాలంటే ఈ డిటాక్స్ వాటర్ తాగండి:

1. యాపిల్ డిటాక్స్ వాటర్:

ఆపిల్ డిటాక్స్ వాటర్ శరీరం నుంచి  వ్యర్థాలను తొలగిస్తుంది. కాబట్టి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఆపిల్‌ డిటాక్స్ వాటర్‌ తయారీ కోసం సేపులను ముందుగా ముక్కలుగా కట్ చేసి నీటిలో ఉంచండి. ఆ తర్వాత అందులో నిమ్మరసం, దాల్చిన చెక్క కలపి తాగండి.

2. లెమన్ డిటాక్స్ వాటర్:

లెమన్ డిటాక్స్ వాటర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి, బరువు తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. ఇందుకోసం పుదీనా ఆకులను లెమన్ వాటర్‌లో మిక్స్ చేసి ఈ నీటి ఖాళీ కడుపుతో తాగాలి.

3. దోసకాయ డిటాక్స్ వాటర్:

దోసకాయ డిటాక్స్ వాటర్‌లో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి పుష్కలంగా లభిస్తాయి. 

దీని కోసం ముందుగా ఒక గ్లాసు నీటిలో కొన్ని దోసకాయ ముక్కలను వేసి.. నిమ్మరసం, బ్లాక్ సాల్ట్, కొన్ని పుదీనా ఆకులు వేసి, ఒక చెంచాతో కలుపుకొని త్రాగాలి.

4. ఆరెంజ్ డిటాక్స్ వాటర్:

ఆరెంజ్ డిటాక్స్ వాటర్‌లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరంలోని కొవ్వును శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది. అందుకే ఇది శరీరం నుంచి వ్యార్థాలను తొలగించి బరువును తగ్గిస్తుంది.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read:KGF Chapter 2 OTT: ఓటీటీలో కేజీయఫ్‌ చాప్టర్‌ 2.. సినిమాను వీక్షించాలంటే డబ్బులు చెల్లించాల్సిందే!

Also Read:World Hypertension Day: భారత్‌లో ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ..రోగులను హెచ్చరిస్తున్నారు వైద్యులు..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News