What Happen Eating Food While Watching Tv: భోజనం చేసేటప్పుడు మీకు టీవీ లేదా మొబైల్ ఫోన్ చూసే అలవాటు ఉందా..? అయితే వెంటనే జాగ్రత్తగా ఉండండి. ఈ అలవాటు ఆరోగ్యానికి అనేక రకాల హాని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పెద్దలకే కాదు, పిల్లలకు కూడా ఈ అలవాటు ఉంటే.. దాని ప్రతికూల ప్రభావాలు వారి శరీరంపై కూడా కనిపిస్తాయనంటున్నారు. ఎన్విరాన్‌మెంటల్ జనరల్ ఆఫ్ హెల్త్ అనే ప్రతిష్టాత్మక మ్యాగజైన్ పిల్లల ఆహారపు అలవాట్లపై చేసిన పరిశోధనలో.. టీవీ చూస్తూ భోజనం చేసే 10 ఏళ్లలోపు పిల్లల్లో ఊబకాయం ముప్పు చాలా రెట్లు పెరుగుతుందనే వెలుగులోకి వచ్చింది. టీవీ, మొబైల్ చూడకుండా భోజనం చేయడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం తగ్గుతుందని తేలింది.
నిజానికి మనిషిలోని చెడు అలవాట్లు.. తీవ్రమైన వ్యాధులవైపు నెట్టివేస్తున్నాయి. చాలా మంది చిన్నప్పటి నుంచి భోజనం చేస్తూ టీవీలు, మొబైల్ ఫోన్లు చూడటం అలవాటు చేసుకున్నారు. ఈ అలవాటు వల్ల చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటారు. మీకు కూడా అలాంటి అలవాటు ఉంటే వెంటనే మానేయండి. ఇలా చేయకుంటే స్థూలకాయం, పొట్ట సమస్యలు, కళ్లు బలహీనపడటం తదితర సమస్యలు వస్తాయి. భోజనం చేసేటప్పుడు టీవీ లేదా మొబైల్ ఫోన్ చూడటం వల్ల శరీరానికి ఎలాంటి హాని కలుగుతుందో తెలుసుకోండి.
గుండె జబ్బు ప్రమాదం
టీవీ లేదా మొబైల్ ఫోన్ చూస్తున్నప్పుడు ఆహారం తినడం వల్ల దృష్టి అంతా స్క్రీన్‌పై ఉంటుంది. దీని కారణంగా శరీరంలోని జీవక్రియ మందగిస్తుంది. కొవ్వు పేరుకుపోతుంది. మరోవైపు ఎంత తిన్నాడో కూడా పట్టించుకోకుండా తినేస్తారు. ఇది మళ్లీ బరువు పెరుగుదలకు కారణమవుతుంది. బరువు పెరగడం వల్ల మీకు గుండె సమస్యలు, టైప్ 2 డయాబెటిస్, రక్తపోటు మొదలైన అనేక తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
కడుపు సమస్యలు
భోజనం చేసే సమయంలో ఆహారం కంటే.. టీవీ చూస్తుంటే స్క్రీన్ వైపు ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. టీవీ ధ్యాసలో పడిపోయి సరిగా నమలకుండా తినేస్తారు. దీంతో కడుపులో అజీర్ణం, నొప్పి మొదలైన సమస్యలు వస్తాయి. మీకు చాలా కాలంగా ఈ అలవాటు ఉంటే.. కడుపు సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి.
బరువు పెరగవచ్చు
ఒక వ్యక్తి టీవీ చూస్తుంటే అందులో ఆహారం, పానీయాలకు సంబంధించిన యాడ్స్ వస్తే తినాలనే కోరిక ఎక్కువై కొద్దిసేపటికే ఆకలి వేస్తుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. నిరంతరంగా ఏదో ఒకటి తినడం వల్ల బరువు పెరిగి అనేక సమస్యలు వస్తాయి.
నిద్రకు భంగం
మీరు రాత్రిపూట భోజనం చేస్తూ టీవీ లేదా మొబైల్ ఫోన్ చూస్తే.. అది మీ నిద్రకు భంగం కలిగిస్తుంది. వాస్తవానికి స్క్రీన్‌ను చూస్తున్నప్పుడు చాలా సార్లు పరిమితికి మించి ఎక్కువ ఆహారాన్ని తింటారు. దీని కారణంగా కడుపులో జీర్ణం కావడం కష్టం అవుతుంది. అటువంటి పరిస్థితిలో రాత్రంతా సమస్యగా ఉండడంతోపాటు నిద్రకు భంగం కలుగుతుంది.
పిల్లలకు ఊబకాయం సమస్యలు..
బయోమెడ్ సెంట్రల్ జనరల్‌లో ప్రచురించిన ఒక సర్వేలో పిల్లలలో ఊబకాయం సమస్యలు పెరుగుతున్నాయని వెల్లడైంది. మన దేశంలో 10 నుంచి 12 శాతం మంది పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారు. భోజనం చేసేటప్పుడు టీవీ, మొబైల్ ఫోన్ చూడటం దీనికి ఒక కారణమని పరిశోధనలో వెల్లడైంది.
Also Read: Viral Video: ముసలోడే కానీ మహానుభావుడు.. తొక్కుడే తొక్కుడు.. వీడియో వైరల్
Also Read: Koratala Siva: మీడియా టెన్షన్.. చివరి నిముషంలో ముఖం చాటేసిన కొరటాల శివ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook