Diabetes Patient: షుగర్ పేషెంట్స్‌ ఈ పండ్లను తింటే ప్రమాదమే..!!

Diabetes Patient: డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు అన్ని పండ్లు ప్రయోజనకరంగా ఉండవు. ఈ వ్యాధిగ్రస్తులు ఎల్లప్పుడూ కొన్ని పండ్లకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి రోగులు ఏదైనా తినే ముందు వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 25, 2022, 12:41 PM IST
  • షుగర్ పేషెంట్స్‌ ద్రాక్ష పండ్లు తింటే ప్రమాదమే
  • రక్తంలో చెక్కర స్థాయి పెంచుతుంది
  • డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు అన్ని పడ్లు తినకూడదు
Diabetes Patient: షుగర్ పేషెంట్స్‌ ఈ పండ్లను తింటే ప్రమాదమే..!!

Diabetes Patient: డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు అన్ని పండ్లు ప్రయోజనకరంగా ఉండవు. ఈ వ్యాధిగ్రస్తులు ఎల్లప్పుడూ కొన్ని పండ్లకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి రోగులు ఏదైనా తినే ముందు వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. కొన్ని రకాల పండ్లను తినడం ద్వారా  రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుందని పేర్కొన్నారు. అయితే డయాబెటిక్ రోగులు ఖచ్చితంగా పలు రకాల పండ్లకు దూరంగా ఉండాలి వైద్యులు తెలుపుతున్నారు. ఆ పండ్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ద్రాక్షకు దూరం ఉండండి:

మధుమేహ వ్యాధిగ్రస్తులకు ద్రాక్ష చాలా హానికరం. ఈ పండులో విటమిన్ సి ఉన్నప్పటికీ..ఇది డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉండదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇందులో ఉండే చక్కెర డయాబెటిక్ రోగుల సమస్యను పెంచుతుంది. కాబట్టి ఈ పండుకు దూరంగా ఉండడం మంచిది.

అరటి పండుకు కూడా దూరం ఉండండి:

డయాబెటిస్‌ ఉన్న వారు అరటిపండును కూడా తినకూడదు. ఈ పండులో అధికంగా పిండి పదార్థాలు, చక్కెర పరిమాణం ఎక్కువగా ఉంటాయి. కనుక రక్తంలో చక్కెర స్థాయి పెరిగే ప్రమాదం ఉంది.

అంజీర్‌కు దూరం ఉండండి:

అంజీర్ పండ్ల వినియోగం కూడా డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులకు ప్రమాదం. ఇందులో ఉండే పిండి పదార్థాలు, చక్కెర పరిమాణం డయాబెటిక్ రోగుల రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read: Viral Video: దొంగతనానికి వెళ్లిన వ్యక్తి..అతన్ని పెంపుడు కుక్కలు ఏం చేశాయో తెలుసా..!!

Also Read: Muskmelon: కర్బూజ పండును ఉదయాన్నే తింటున్నారా..అయితే ప్రమాదమే..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://bit.ly/3hDyh4G

 

Apple Link - https://apple.co/3loQYe 

 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News