Diabetes Control: డయాబెటిస్ వారు ఏ సమయానికి ఏమి తినాలి…ఫుల్ డైట్ ప్లాన్

Diabetes diet : డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు ఆహారం విషయంలో ఎప్పుడు కన్ఫ్యూజ్డ్ గా ఉంటారు. ఏమి తినొచ్చు ఏమి తినకూడదు అన్న విషయంపై కొన్నిసార్లు స్పష్టత ఉండదు. అందుకే మీకోసం ఒక వారం మొత్తం తీసుకోదగిన ఆరోగ్యకరమైన డైట్ తీసుకొచ్చాం..  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 10, 2024, 12:55 PM IST
Diabetes Control: డయాబెటిస్ వారు ఏ సమయానికి ఏమి తినాలి…ఫుల్ డైట్ ప్లాన్

Diabetes Meal Timing : డయాబెటిస్ తో బాధపడే వారికి రుచికరమైన ఆహారం తినాలి అన్న భయంగా ఉంటుంది. ఏం తింటే ఏమవుతుందో అన్న టెన్షన్ తో చాలా ఇబ్బంది పడతారు. కానీ మనకు నచ్చిన విధంగా తింటూ కూడా షుగర్ ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు అన్న విషయం మీకు తెలుసా. బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం వల్ల మన రక్తంలోని చక్కర స్థాయిలను ఎప్పుడు కంట్రోల్ లో ఉంచొచ్చు. వారం రోజుల పాటు ఇటువంటి బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం వల్ల మధుమేహాన్ని సులభంగా దూరం చేయవచ్చు. 

చాలామందికి తెలియని విషయం ఏమిటంటే రక్తంలో చక్కెర స్థాయి అనేది మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ఆహారాన్ని నియంత్రిస్తే షుగర్ ని కూడా నియంత్రించొచ్చు. అంటే మనం తీసుకునే ఫుడ్ తోటే మనం మన సమస్యలను దూరంగా పెట్టొచ్చు. షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారికి  ఎటువంటి డైట్ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి సులభంగా కంట్రోల్ అవుతుందో తెలుసుకుందాం..

బ్రేక్ ఫాస్ట్: పొద్దున మనం తీసుకునే అల్పాహారం మన శరీరానికి ఎంతో శక్తినిస్తుంది. ఓట్ మీల్, డ్రై ఫ్రూట్స్, మొలకలు లాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. అల్లం ,జీలకర్ర వేసి కాసిన నీళ్లు తాగడం వల్ల డయాబెటిస్ పేషెంట్స్ కు చాలా మేలు కలుగుతుంది. 

లంచ్: మధ్యాహ్నం తీసుకునే ఆహారం లో మసాలా శాతం వీలైనంత తక్కువగా ఉండేలా చూసుకోండి. పప్పు, కూరగాయల  ఫ్రై , పెరుగు లాంటివి తప్పకుండా తీసుకోవాలి. వైట్ రైస్ కంటే కూడా బ్రౌన్ రైస్ ని ఉపయోగిస్తే మంచిది. మీరు మాంసాహారులైతే ఉడకపెట్టిన కోడి గుడ్డు, ఫిష్ ఫ్రై లాంటి ఆహార పదార్థాలు తీసుకోవచ్చు. మీరు ఏం తిన్నా? వీలైనంత తక్కువ నూనె వాడే విధంగా చూసుకోండి. 

స్నాక్స్: స్నాక్స్ కింద ఆయిల్ తో చేసిన మైదా వస్తువులు అస్సలు తినకూడదు. ఉడకపెట్టిన గూగుల్, మొక్కజొన్న, స్వీట్ పొటాటో లాంటివి తీసుకోవాలి. 

డిన్నర్: డిన్నర్ వీలైనంత త్వరగా 7 లోపే తినడం మంచిది. రాత్రిపూట తీసుకునే ఆహారం వీలైనంత ఎక్కువ జీర్ణమయ్యే విధంగా ఉండాలి. చపాతీలు, రైత, బాయిల్డ్ వెజిటేబుల్ సలాడ్ లాంటివి తీసుకోవడం మంచిది. ఈ సమయంలో రాగి జావా లేదు బార్లీ జావా లాంటివి కూడా తీసుకోవచ్చు.

Also Read: Pawan Chiranjeevi Meet: పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి ఆశీర్వాదం.. రూ.5 కోట్ల విరాళంతో భరోసా ఇచ్చిన 'అన్నయ్య'

Also Read: Pawan Kalyan: జగన్‌లాంటి 'కోడిగుడ్డు' ప్రభుత్వం ఇంకా కావాలా? పవన్‌ కల్యాణ్‌

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News