COVID symptoms: symptoms of Omicron that are different from Delta Know here : కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ మధ్య తేడాలు చాలా మందికి అర్థం కావడం లేదు. రెండింటి లక్షణాలు దాదాపుగా ఒకే రకంగా ఉండడంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారీగా పెరుగుతుండడంతో ప్రజల్లో ఈ ఆందోళన మరింత పెరిగింది.
చాలా మంది శాస్త్రవేత్తలు, నిపుణులు డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని పేర్కొన్నారు. అంతేకాదు ప్రస్తుతం చాలా దేశాల్లో ఇప్పుడు ఈ కొత్త కోవిడ్-19 (COVID-19) వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా సెకెండ్ వేవ్‌తో పోలిస్తే మరణాలు మాత్రం కాస్త తక్కువగానే నమోదు అవుతున్నాయి.
డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాల మధ్య తేడాను గుర్తించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. గ్లోబల్ పాండమిక్ సెకెండ్ వేవ్‌కు (Second wave) కారణమైన డెల్టా వేరియంట్‌తో పోలిస్తే, ఒమిక్రాన్ వేరియంట్‌లో అంత ప్రభావంతమైన లక్షణాలు కనపడవు. జలుబు, దగ్గు,జ్వరం వంటి లక్షణాలు కొత్త వేరియెంట్‌లో ప్రభావంతంగా కనిపించవు.
ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ బారినపడినట్లయితే.. వారికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడుతాయని AIIMS చెందిన డాక్టర్ తెలిపారు. అయితే ఈ కొత్త వేరియెంట్ ప్రభావం.. ఊపిరితిత్తులపై కాకుండా గొంతులోనే చూపిస్తుంది.ఒమిక్రాన్ వేరియెంట్ ప్రభావం.. ఊపిరితిత్తులు, శ్వాసకోశాలపై అంత ఎక్కువగా ఉండదు. అంతేకాదు ఈ వేరియెంట్ బారిన పడినప్పటికీ చాలా మందిలో అసలు ఎలాంటి లక్షణాలను కనిపించవు.
ఒమిక్రాన్ (Omicron) బారినపడిన వారిలో చాలా మంది జ్వరం, తలనొప్పి, ముక్కు మూసుకుపోవడం, దగ్గు వంటి సమస్యలతో బాధ బాధపడుతున్నట్లు తేలింది. అయితే ఒమిక్రాన్ టెస్ట్ జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా చేయాల్సి ఉంటుంది. దీంతో డెల్టా వేరియెంట్, (Delta variant) ఒమిక్రాన్ మధ్య తేడాలను గుర్తించడం కాస్త కష్టంగా మారింది.
Also Read : Rahul Dravid on Kohli: కెప్టెన్ విరాట్ కోహ్లీపై కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు.. అతడొక అద్భుతమని కితాబు
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఒమిక్రాన్ విజృంభిస్తుండంతో.. ఇంటి నుంచి బయటికి వచ్చేటప్పుడు కచ్చితంగా మాస్క్ ధరించాలి. అలాగే శానిటైజర్‌తో తరుచుగా చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటుంటే ఒమిక్రాన్ (Omicron) బారినపడకుండా ఉండొచ్చు.
Also Read : Corona in Telangana: తెలంగాణలో కొత్తగా మరో 5 ఒమిక్రాన్ కేసులు- మొత్తం @ 84
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook