Coriander Juice Benefits: కొత్తిమీర ఆహారాల రుచిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఈ ఆకులను రసంగా తయారు చేసుకుని రోజు తాగడం వల్ల శరీరానికి తగిన ఫైబర్ లభిస్తుంది. దీంతో పాటు ఇందులో యాంటీస్పాస్మోడిక్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తరచుగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు వారకు కూడా ఈ రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మధుమేహం ఉన్నవారిలో తరచుగా రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. ఈ కొత్తమీర ఆకులతో తయారు చేసిన జ్యూస్‌ని తాగడం వల్ల కూడా రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించుకోవచ్చు. అంతేకాకుండా ఈ రసం తాగితే శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఇవే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
కొత్తిమీర రసం ప్రతి రోజు తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా మలబద్ధకం నుంచి ఉపశమనం కలుగుతుంది. దీంతో పాటు ఇందులో ఉండే గుణాలు అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. అలాగే కొత్తిమీరలో యాంటీస్పాస్మోడిక్ లక్షణాలు కడుపు నొప్పిని తగ్గిస్తాయి.
2. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రిస్తాయి:
టైప్ 2 మధుమేహం ఉన్నవారికి కొత్తిమీర రసం ఔషధంలా పని చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కొత్తిమీరలో యాంటీడయాబెటిక్ లక్షణాలు అధిక మోతాదులో లభిస్తాయి. ఇవి గ్లూకోజ్ శోషణను నియంత్రించడానికి, గ్లైకోజెనోలిసిస్‌ను ప్రోత్సహించడానికి సహాయపడతాయి.
3. రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
కొత్తిమీర రసం యాంటీఆక్సిడెంట్లు ఎక్కవగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తాయి. దీంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా సహాయపడుతుంది. అలాగే జలుబు, ఫ్లూ వంటి అంటువ్యాధులకు ప్రమాదాన్ని సులభంగా తగ్గిస్తుంది. కొత్తిమీర రసంలో యాంటీమైక్రోబయల్, యాంటీవైరల్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి సహాయపడతాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
4. శరీర వాపు తగ్గుతుంది:
కొత్తిమీరలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గౌతం వ్యాధి, ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వాపుతో కూడిన వ్యాధులకు చికిత్స కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. శరీరంలోని నొప్పులు, వాపులను కూడా ఇది తగ్గిస్తుంది. కొత్తిమీరలోని యాంటీ-ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు సైక్లోఆక్సిజెనేస్ (COX) ఎంజైమ్లను అడ్డుకుని వాపులను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Coriander Juice Benefits: రోజు కొత్తిమీర రసం తాగితే మధుమేహానికి చెక్.. నమ్మట్లేదా?