Constipation: చిటికెలో వీటిని ఉపయోగించి మలబద్ధకం సమస్యల నుంచి ఇలా ఉపశమనం పొందండి..

  Constipation Home Remedies: మలబద్ధకం సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల ఇంటి చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2022, 02:43 PM IST
Constipation: చిటికెలో వీటిని ఉపయోగించి మలబద్ధకం సమస్యల నుంచి ఇలా ఉపశమనం పొందండి..

Constipation Home Remedies: మలబద్ధకం సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం చాలా మంది మలబద్ధకం వ్యాధితోనే కాకుండా పొట్ట సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు తీసుకునే ఆహారం అనారోగ్యకరంగా ఉండడం వల్లేనని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి  చర్యలు తీసుకుంటే మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చొ ఇప్పుడు తెలుసుకుందాం..

వీటితో మలబద్ధకానికి చెక్‌:

మలబద్ధకం సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతి రోజూ యాపిల్స్‌ పండ్లను తినాల్సి ఉంటుంది. ఇందులో ఫైబర్‌ పరిమాణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి మలాన్ని మృదువుగా చేయడానికి సహాయపడతాయి. దీంతో పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయి. కాబట్టి పొట్ట సమస్యలతో బాధపడేవారు తప్పకుండా యాపిల్‌ పండ్లను తినాల్సి ఉంటుంది.

అవిసె గింజలతో కూడా మలబద్ధకం సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. ఈ గింజలను ప్రతి రోజూ ఆహారంలో వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూరుతాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి పొట్టలోని మలబద్ధకం సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.

బంగాళదుంపలో ఉండే గుణాలు మలబద్ధకం ఇతర సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశనం కలిగించేందుకు సహాయపడుతుంది. ప్రతి రోజూ రాత్రి  2 నుంచి 3 బంగాళదుంపలను ఉడికించి తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా మలబద్ధకం సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.  

మలబద్ధకం సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ప్రోటిన్లు అధికంగా ఉండే ఆహారాలు, దేశీ నెయ్యిని తీసుకోవాల్సి డైట్‌లో తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రతి రోజూ ఇలాంటి ఆహారాలను తీసుకుంటే అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

Also Read: TSPSC JL Recruitment: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. అప్లికేషన్ ప్రక్రియ వాయిదా

Also Read: మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత.. కర్రలు, రాళ్లతో వైసీపీ-టీడీపీ నేతల పరస్పర దాడి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News