Coffee Benefits: ప్రతిరోజూ కాఫీ తాగుతున్నారా, అయితే కోవిడ్-19 గురించి ఇది తెలుసుకోండి

Health Benefits Of Coffee: కాఫీ తాగే అలవాటుకు, కోవిడ్19 వ్యాప్తికి ఉన్న సంబంధాన్ని ఓ అధ్యయనంలో గుర్తించారు. అసలే కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా తగ్గలేదు. కనుక పలు అంశాలపై అధ్యయనాలు కొనసాగుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 12, 2021, 04:48 PM IST
  • కాఫీ తాగేవారిలో కోవిడ్19 మహమ్మారి బారిన పడే అవకాశాలు తక్కువ
  • కాఫీ మంచి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుందని తెలిసిందే
  • పెద్దవారిలో అయితే న్యూమోనియా బారిన పడే అవకాశాన్ని తగ్గిస్తుంది
Coffee Benefits: ప్రతిరోజూ కాఫీ తాగుతున్నారా, అయితే కోవిడ్-19 గురించి ఇది తెలుసుకోండి

Coffee Benefits: ఏదైనా పనిలో ఉంటే ఓ కప్పు కాఫీ, టీ గానీ తాగారంటే కాస్త రిలాక్స్ అవుతుంటాం. అయితే కాఫీ తాగే అలవాటుకు, కోవిడ్19 వ్యాప్తికి ఉన్న సంబంధాన్ని ఓ అధ్యయనంలో గుర్తించారు. అసలే కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా తగ్గలేదు. కనుక పలు అంశాలపై అధ్యయనాలు కొనసాగుతున్నాయి.

ప్రతిరోజూ కాఫీ తాగేవారిలో కోవిడ్19 మహమ్మారి బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఓ యూనివర్సిటీ రీసెర్చ్‌లో గుర్తించారు. ప్రతిరోజు ఒక కప్పు లేదా అంతకంటే తక్కువ కాఫీ తాగేవారితో పోల్చితే, రోజులో ఒక కప్పు కంటే అధికంగా కాఫీ తీసుకునే వారిలో కరోనా (India Corona Recoveries) బారిన పడే అవకాశాలు 10 శాతం తక్కువగా ఉంటాయి. వీటితో పాటు ప్రతిరోజూ తాజా కూరగాయలు తినేవారు, తక్కువగా మాంసం (Non Veg Food Items) తీసుకునే వారిలో కోవిడ్19 బారినపడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని న్యూట్రియెంట్స్ జర్నల్‌లో ప్రచురించారు.

Also Read: Cardiac Issues: కరోనా నుంచి కోలుకున్న యువతలో..గుండెపోటు సమస్యలు

కాఫీ మంచి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుందని తెలిసిందే. కాఫీ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. తద్వారా కాఫీ తాగేవారిలో సీఆర్‌పీ, ఇంటర్‌ల్యూకిన్-6, ట్యూమర్ నెక్రోసిస్ కారకం 1 లాంటి వాటిపై ప్రభావం చూపుతుంది. ఈ చర్యల ఫలితంగా కోవిడ్-19 (COVID-19 Delta Variant)ను ఎదుర్కొనే సామర్థం మనలో పెరుగుతుంది. పెద్దవారిలో అయితే న్యూమోనియా బారిన పడే అవకాశాన్ని తగ్గిస్తుంది. ప్రస్తుతం సంభవిస్తున్న కరోనా మరణాలో న్యూమోనియా బాధితులు అధిక సంఖ్యలో ఉన్నారు. రోగనిరోధక శక్తిని పెంపొందించకపోయినా, మిమ్మల్ని ఉత్సాహంగా ఉండేలా మాత్రం కాఫీ చేస్తుందని అధ్యయనం వివరాలను వెల్లడించారు.

Also Read: Vitamin D Benefits: విటమిన్ డి లోపం ఉన్నవారిలో కోవిడ్19 మరణాలు అధికం, సర్వేలో వెల్లడి

ఏది ఏమైనా 18 వయసు పైబడిన వారు కరోనా టీకాలు తీసుకోవడం శ్రేయస్కరం. టీకాలు తీసుకున్న వారికి కరోనా సోకినా మహమ్మారి ప్రభావం అంతంతమాత్రంగానే ఉంటుంది. వీరి నుంచి ఇతరులకు వ్యాప్తి చెందే శాతం సైతం తక్కువ అని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్19 నిబంధనలైన భౌతికదూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, బయటకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించడం లాంటివి చేస్తూనే, కరోనా టీకాలు తీసుకుంటే వైరస్‌పై కొంత కాలానికే విజయం సాధించవచ్చునని ఆరోగ్య నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News