Loss 5 Kg weight in 14 days with Cinnamon Tea: ఒకే రకం ఆయుర్వేద గుణాలు కలిగిన సుగంధ ద్రవ్యాన్ని టీల తయారు చేసుకుని తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. సుగంధ ద్రవ్యమైన దాల్చిన చెక్కతో తయారుచేసిన టీ ని ప్రతిరోజు రెండు సార్లు తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చట. ఇందులో ఉండే మూలకాలు జిడ్డు కొలెస్ట్రాలను సైతం కరిగించే శక్తిని కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులను శరీరాన్ని రక్షిస్తాయి. ఈ టీ తాగడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ శరీరానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులను సైతం సులభంగా తిప్పి కొడుతుంది. ముఖ్యంగా ఊబకాయం సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు ఈ టీని తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. డైట్ లో భాగంగా నెల ఈ టీని ప్రతిరోజు రెండు కప్పుల చొప్పున తీసుకుంటే 5 కేజీల బరువు తగ్గొచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్
దాల్చిన చెక్క టీ మధుమేహంతో బాధపడుతున్న వారికి కూడా ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మధుమేహం ఉన్నవారు రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించుకునేందుకు ప్రతిరోజు ఈ టీ ని తాగవవచ్చు. ఇందులో ఉండే గుణాలు తీవ్రవాదుల నుంచి కూడా రక్షిస్తాయి.
ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారు ఈ టీ ని ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను కరిగించడానికి ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ కారణంగా వచ్చే గుండె సంబంధిత వ్యాధులు రాకుండా శరీరాన్ని సంరక్షిస్తుంది.
ఆధునిక జీవన శైలి కారణంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అనారోగ్యకరమైన ఆహారాలను విచ్చలవిడిగా తింటున్నారు. దీని కారణంగా జీర్ణక్రియ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ ని తాగాల్సి ఉంటుంది. ఈ టీలో ఉండే గుణాలు జీర్ణక్రియ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి