Common Signs Of High Cholesterol: చలి తీవ్రత కారణంగా చాలామందిలో గుండెపోటు సమస్యలు వస్తున్నాయి. అయితే చలి తీవ్రత కారణంగా గుండెలోని ధమనులపై ప్రభావం పడి ఇతర అవయవాలకు రక్త సరఫరాలో అంతరాయం కలుగుతుంది. అంతేకాకుండా మరికొందరిలో రక్తప్రసరణ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతోంది. ఇలా రక్త ప్రసరణ వ్యవస్థ ఆగిపోవడం వల్ల చాలామందిలో తీవ్ర అనారోగ్య సమస్యలు సంభవించి మరణిస్తున్నారు. కాబట్టి ఇంతకుముందే గుండెపోటు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
వీటిని తినడం వల్ల రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరచుకోవచ్చు:
శరీరంలో ఎక్కడికి అక్కడ చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ధమనులలో రక్తం గడ్డకట్టి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే దీనికోసం లిపిడ్ ప్రొఫైల్ స్థాయిలను ప్రభావితం చేసే యాపిల్ పండ్లను ప్రతిరోజు ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు యాపిల్ పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్, ఇతర సైన్స్ జర్నల్స్‌లో ప్రచురించబడిన ఒక పరిశోధన నివేదిక ప్రకారం.. అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారు యాపిల్ పండ్లను ప్రతిరోజు తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొంది. అంతేకాకుండా 100 మందిలో 46 మంది ఊబకాయం సమస్యలు కూడా తగ్గాయని పరిశోధనల్లో వివరించారు.
ఈ పరిశోధన ప్రకారం.. తాజా యాపిల్‌లో 485 mg పాలీఫెనాల్స్ , 4.03 g/100 g ఫైబర్ లభిస్తుందని.. ఊబకాయం, చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు వీటిని రెండు నెలల పాటు తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని పేర్కొన్నారు. అంతేకాకుండా ట్రైగ్లిజరైడ్ ను కూడా తగ్గించే తగ్గించే గుణాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఖాళీ కడుపుతో ప్రతిరోజు యాపిల్ పండ్లను తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Also Read: Veera Simha Reddy Review : వీర సింహా రెడ్డి రివ్యూ.. మెప్పించిన బాలయ్య, నొప్పించిన గోపీచంద్
Also Read: Veera Simha Reddy Twitter Review : వీర సింహా రెడ్డి ట్విట్టర్ స్టోరీ.. బోయపాటి కన్నా అరాచకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి