భార్యకు లిప్‌లాక్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన మహేష్.. ఫోటో వైరల్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన తాజా చిత్రం 'భ‌ర‌త్ అనే నేను'.

Last Updated : Apr 22, 2018, 02:26 PM IST
భార్యకు లిప్‌లాక్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన మహేష్.. ఫోటో వైరల్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన తాజా చిత్రం 'భ‌ర‌త్ అనే నేను'. కొర‌టాల శివ ద‌ర్శక‌త్వంలో వచ్చిన ఈ చిత్రంలో మ‌హేష్ సీఎం పాత్రలో నటించాడు. ఏప్రిల్ 20న విడుద‌లైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల‌లోనే కాక ఇత‌ర రాష్ట్రాల్లోనూ మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. కేవ‌లం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల వసూళ్లను సాధించింది.  ఒక్క అమెరికాలోనే ఈ చిత్రం రెండు మిలియ‌న్ డాల‌ర్లు రాబ‌ట్టింది. ఇంత పెద్ద విజ‌యాన్ని అందించిన అభిమానుల‌కి మ‌హేష్ త‌న ట్విట్టర్ ద్వారా కృత‌జ్ఞత‌లు తెలిపాడు. ఈ విజయాన్ని సతీమణి న‌మ్రతాతో పంచుకున్నాడు మ‌హేష్. సతీమణిని ఆత్మీయంగా ద‌గ్గర‌కు తీసుకుని ఆమెకు ముద్దు ఇచ్చాడు. ఆ ఫోటోను 'థ్యాంక్యూ మై లవ్' అంటూ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు మ‌హేష్.

 

 

Thankyou my love ❤

A post shared by Mahesh Babu (@urstrulymahesh) on

 

ఇదిలా ఉండగా.. ఈ ఏడాది జ‌న‌వరిలో మ‌హేష్ ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాను అలా తెరిచాడో లేదో ఫాలోవ‌ర్స్ సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. మ‌హేష్ భార్య న‌మ్రత ఇన్‌స్ట్రాగ్రమ్‌లోఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. మ‌హేష్ మాత్రం రీసెంట్‌గా ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతా తెరిచాడు. ప్రస్తుతం మ‌హేష్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవ‌ర్స్ సంఖ్య ఒక మిలియ‌న్ మార్క్ చేరుకుంది. ఇటీవ‌ల మ‌హేష్‌ ట్విట్టర్ ఫాలోవ‌ర్స్ సంఖ్య 5 మిలియ‌న్లకి చేరిన సంగ‌తి తెలిసిందే...!

Trending News