Sitara Crying: నాన్నమ్మ పార్థివదేహాన్ని చూసి.. బోరున ఏడ్చేసిన మహేశ్‌ బాబు కుమార్తె సితార!

Mahesh Babu Daughter Sitara Crying at Indira Devi Dead Body. నాన్నమ్మ పార్థివదేహాన్ని చూసి సూపర్ స్టార్ మహేశ్‌ బాబు కుమార్తె 'సితార మహేష్' తట్టుకోలేకపోయారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 28, 2022, 01:10 PM IST
  • నాన్నమ్మ పార్థివదేహాన్ని చూసి..
  • బోరున ఏడ్చేసిన మహేశ్‌ కుమార్తె సితార
  • మహాప్రస్థానంలో ఇందిరా దేవి అంతిమ సంస్కారాలు
Sitara Crying: నాన్నమ్మ పార్థివదేహాన్ని చూసి.. బోరున ఏడ్చేసిన మహేశ్‌ బాబు కుమార్తె సితార!

Mahesh Babu Daughter Sitara Crying at Indira Devi Dead Body: సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, మహేశ్‌ బాబు తల్లి ఇందిరా దేవి బుధవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 70 సంవత్సరాలు.  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని నివాసంలో కన్నుమూశారు. ఇందిరా దేవి మరణంతో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇందిరా దేవికి ర‌మేష్ బాబు, మహేష్ బాబు, ప‌ద్మావ‌తి, మంజుల, ప్రియదర్శిని ఐదుగురు సంతానం.

కుటుంబసభ్యులు, సన్నిహితుల సందర్శనార్థం ఇందిరా దేవి పార్థివదేహాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచారు. ఇందిరాకు తుది నివాళి అర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు పద్మాలయ స్టూడియోకు తరలివస్తున్నారు. ఇక నాన్నమ్మ పార్థివదేహాన్ని చూసి సూపర్ స్టార్ మహేశ్‌ బాబు కుమార్తె 'సితార మహేష్' తట్టుకోలేకపోయారు. మహేశ్‌ బాబు ఒడిలో కూర్చొని కన్నీటి పర్యంతమయ్యారు. మహేష్ ఓదార్చినా  కూడా సితార తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

ఈరోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఇందిరా దేవి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు ఘట్టమనేని 
 కుటుంబసభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మీడియాకు అనుమతి లేదు. ఈ ఏడాది జనవరిలోనే ఇందిరా దేవి కుమారుడు రమేశ్‌ బాబు (56) మృతి చెందిన విషయం తెలిసిందే. ఏడాది తిరగకముందే ఇందిరా దేవి కూడా కన్నుమూశారు.  రెండు ఘటనలు ఘట్టమనేని  కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టాయి. 

Also Read: IND vs SA: దక్షిణాఫ్రికాపై అత్యధిక రన్స్ చేసిన భారత బ్యాటర్లు వీరే.. టాప్‌లో రోహిత్ శర్మ!  

Also Read: విరాట్ కోహ్లీకి పోటీగా రోహిత్ శర్మ భారీ కటౌట్.. రోహిత్ డబ్బులు పంపించాడా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News