పవన్ ఫ్యాన్స్‌కు రెండు రోజుల్లో పండగ

రాజకీయాల్లో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.  వచ్చీ రాగానే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. త్వరత్వరగా సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు ఆయన. 

Last Updated : Feb 29, 2020, 01:43 PM IST
పవన్ ఫ్యాన్స్‌కు రెండు రోజుల్లో పండగ

రాజకీయాల్లో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.  వచ్చీ రాగానే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. త్వరత్వరగా సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు ఆయన. ఈ క్రమంలో ఆయన తాజాగా నటిస్తున్న సినిమా 'పింక్' రీమేక్. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. 

మార్చి 2న సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతే కాదు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కొత్త సినిమా పాట చేయనున్నట్లు తెలుస్తోంది. దీని కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. #pspk26firstlook అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. 

అంతేకాదు ఇప్పటికే పవర్ స్టార్ సినిమాకు అభిమానులు టైటిల్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం వకీల్ సాబ్ అనే టైటిల్ ఎక్కువగా ప్రచారంలో ఉంది. కానీ బాలీవుడ్ సినిమా 'పింక్' కు రీమేక్ గా తెలుగులో వస్తున్న ఈ సినిమాకు చిత్ర దర్శక, నిర్మాతలు ఇంకా పేరు ఖరారు చేయలేదు. కానీ అభిమానులు మాత్రం తమ స్టార్ హీరో కొత్త సినిమా టైటిల్ ను విపరీతంగా వైరల్ చేస్తున్నారు. పవర్ స్టార్ కొత్త సినిమా పోస్టర్లు కూడా డిజైన్ చేశారు. 

ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Trending News