Producer TG Viswa Prasad: డిఫరెంట్ మూవీల నిర్మాణంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంది. ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ విజనరీ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఇక జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రీసెంట్‌గా హైదరాబాద్‌లో భారీగా వేడుకలు నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్‌కు ఇండస్ట్రీ నుంచి పెద్దలను పిలిపించి.. గ్రాండ్ పార్టీ ఇచ్చారు. కూటమి విజయానికి కృషి చేసిన వారిని సత్కరించారు. పవన్ కళ్యాణ్‌తో బ్రో మూవీ నిర్మించి తన కోరిక నెరవేర్చుకున్నారు. పవన్‌తో సినిమాల పరంగానేకాకుండా.. వ్యక్తిగతంగానూ ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఎన్నికలకు ముందు ఇండస్ట్రీ నుంచి కూటమికి మద్దతు ఇచ్చిన వారిలో టీజీ విశ్వప్రసాద్ కూడా ఒకరు.
Also Read: Tragic Incident: వరదలతో తెగిన అన్నాచెల్లెలి అనుబంధం.. మృతదేహాన్ని 5 కి మీ మోసుకెళ్లిన అన్నలు
2018 నుంచి టీజీ విశ్వప్రసాద్ జనసేనకు సపోర్ట్ చేస్తునే ఉన్నారు. అప్పుడు మేనిఫెస్టో విడుదల నుంచి జనసేన ప్రవాస గర్జన సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో పాటు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేశారు. ఎలక్షన్ రిజల్ట్స్ తరువాత ఆయన తొలిసారిగా అమెరికాలోని సియాటిల్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా టీజీ విశ్వప్రసాద్‌కు ఎయిర్‌పోర్టులో జనసేనికుల నుంచి ఘన స్వాగతం లభించింది. సియాటిల్‌లోని శ్రీదేవి ఫంక్షన్ హాల్‌లో టీజీ విశ్వప్రసాద్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. అందరి సమష్టి కృషితో ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించిందని అన్నారు. టీడీపీ, జనసేప మద్దతుదారులు ఒకే స్పూర్తితో పనిచేయాలని సూచించారు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వరుస ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉంది. భారీ ప్రాజెక్ట్‌లతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ధమాకా మూవీ బ్లాక్ బస్టర్ అందుకోగా.. పవన్ కళ్యాణ్‌తో తీసిన బ్రో మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో రాజా సాబ్ మూవీని నిర్మిస్తున్నారు. ఆదిపురుష్‌ను తెలుగులో విడుదల చేశారు. ప్రభాస్ స్పిరిట్ సినిమాను కూడా తెలుగులో టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేయనున్నారు. రవితేజతో తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. తేజ సజ్జతో మిరాయ్ మూవీని నిర్మిస్తున్నారు.
Also Read: Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్.. ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి