ఎన్.టి.ఆర్ బయోపిక్ చేయడానికి నీ రేటెంత అని అడిగారు : నటుడు నరేష్

ఎన్.టి.ఆర్ బయోపిక్ చేస్తాననే అనుకోలేదు: నరేష్

Last Updated : Jan 5, 2019, 07:51 PM IST
ఎన్.టి.ఆర్ బయోపిక్ చేయడానికి నీ రేటెంత అని అడిగారు : నటుడు నరేష్

స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామా రావు గారి యదార్ధగాధ ఆధారంగా తెరకెక్కిన ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాలోని మొదటి భాగం ఎన్.టి.ఆర్ కథా నాయకుడు జనవరి 9న ఆడియెన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. విడుదల తేదీకి ఇంకెంతో దూరం లేని ప్రస్తుత తరుణంలో తాజాగా ఈ చిత్ర నిర్మాతలు మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. అందులో భాగంగానే ఈ సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేసిన నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్, ఇతర కీలక పాత్రలు పోషించిన సహనటీనటులను ఇదే సినిమాలో మరో కీలకమైన పాత్ర పోషించిన రానా దగ్గుబాటి ఇంటర్వ్యూ చేసిన మరో వీడియోను ఎన్.బి.కే ఫిలింస్ విడుదల చేసింది. ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర పోషించిన సీనియర్ నటుడు నరేష్ సైతం ఎన్.టి.ఆర్ బయోపిక్ జర్నీ గురించి తన భావాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా నరేష్ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే విందాం.

Trending News