విరాట్ కోహ్లీ పేరుతో ప్రజలను మోసం చేసిన సర్పంచ్ అభ్యర్థి..!

మహారాష్ట్రలోని రామ్ లింగా గ్రామానికి చెందిన పంచాయితీ ఎన్ని్కల్లో సర్పంచి పదవికి పోటీ చేశాడు విఠల్ గణపతి. తనకే గ్రామస్తులు అందరూ ఓటేయాలని.. తాను ఈ ఎన్నికల ప్రచారానికి సాక్షాత్తు భారత్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీనే తీసుకొస్తానని భారీ ఎత్తున ప్రచారం కూడా చేశాడు గణపతి. 

Last Updated : May 28, 2018, 07:30 PM IST
విరాట్ కోహ్లీ పేరుతో ప్రజలను మోసం చేసిన సర్పంచ్ అభ్యర్థి..!

మహారాష్ట్రలోని రామ్ లింగా గ్రామానికి చెందిన పంచాయితీ ఎన్నికల్లో సర్పంచి పదవికి పోటీ చేశాడు విఠల్ గణపతి. తనకే గ్రామస్తులు అందరూ ఓటేయాలని.. తాను ఈ ఎన్నికల ప్రచారానికి సాక్షాత్తు భారత్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీనే తీసుకొస్తానని భారీ ఎత్తున ప్రచారం కూడా చేశాడు గణపతి. మే 25వ తేదిన జరిగే ర్యాలీకి కోహ్లీ తప్పకుండా వస్తాడని ఆయన తెలిపారు. ఆ ప్రచారంతో మే 25వ తేదిన కోహ్లీని చూడడానికి ఊరూ వాడా అంతా కదిలి వచ్చింది.

కుర్రాళ్లైతే ఎప్పుడెప్పుడు కోహ్లీతో సెల్ఫీలు దిగుదామా అని ఆశ కూడా పడ్డారు. అందరూ అనుకున్నట్టు గానే కోహ్లీ కారు కూడా దిగి ప్రజల మధ్యకు వచ్చాడు. కానీ ఆయనను చూడగానే ముక్కున వేలేసుకోవడం గ్రామస్తుల వంతైంది. ఎందుకంటే ఆయన నిజంగా కోహ్లీ కాదు.. అచ్చం విరాట్ కోహ్లిని పోలి ఉన్న ఓ డూప్ మాత్రమే. 

అయితే ఆ డూప్‌ని చూసి కొందరు గ్రామస్తులు సర్పంచి అభ్యర్థిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి.. అతనికి ఓటేసేది లేదని చెప్పి వెళ్లిపోయారు. అయితే దొరికిందే దక్కుదల అని భావించి ఆ డూప్లికేటు కోహ్లీతోనే కొందరు కుర్రాళ్లు సెల్ఫీలు దిగారు. ఇటీవలే ఈ విషయాన్ని తెలుపుతూ అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫోటోతో సహా ఆ డూప్లికేటు కోహ్లీ వివరాలను పోస్టు చేయడంతో ఆ పోస్టు ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. 

Trending News