శ్రీరెడ్డిపై కేసు పెట్టే యోచనలో కోన వెంకట్..!

రోజురోజుకీ సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్న శ్రీరెడ్డి తాజాగా మరో పోస్టు చేసింది.

Last Updated : Apr 12, 2018, 09:18 AM IST
శ్రీరెడ్డిపై కేసు పెట్టే యోచనలో కోన వెంకట్..!

రోజురోజుకీ సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్న శ్రీరెడ్డి తాజాగా మరో పోస్టు చేసింది. ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్‌ తనని బలవంతపెట్టాడని ఆమె ఆరోపించింది. . వివి వినాయక్ ను పరిచయం చేస్తానని గెస్ట్ హౌస్ కి పిలిచి తనని బలవంత పెట్టాడని వ్యాఖ్యానించింది. ఇప్పటికే ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కొడుకు అభి రామ్‌పై సంచలన ఆరోపణ చేసింది శ్రీరెడ్డి.

అటు శ్రీరెడ్డి విషయంపై కోన వెంకట్‌ స్పందించారు. ‘‘నాతో సహా కొంతమంది సినీ ప్రముఖులపై ఓ నటి చేస్తున్న ఆరోపణలతో నేను షాక్‌కి గురయ్యాను. దీనిపై పోలీసులతో కూలంకషంగా, లోతుగా దర్యాప్తు చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాను. సత్యం జయించాలి. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి' అని అన్నారు.  కొంతమంది చీప్ పబ్లిసిటీ కోసం సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టకరమని.. సినిమాలలో తెలుగు నటీనటులను తీసుకోవాలనే డిమాండ్‌ని నేను కూడా సమర్థిస్తానని అన్నారు.  నా ‘గీతాంజలి’ సినిమాలో ఉన్నవారంతా తెలుగువారే. అలాంటి నాపై ఈ ఆరోపణలు చేయడం సరికాదు. నేను ఆమె చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నానని కోన వెంకట్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

 

 

Trending News