జూ.ఎన్టీఆర్ మీదకొస్తున్న గుర్రం ....ఇంతకీ ఏమైందో తెలుసా ?

జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి సాహసం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే...

Last Updated : Jun 27, 2019, 09:43 PM IST
జూ.ఎన్టీఆర్ మీదకొస్తున్న గుర్రం ....ఇంతకీ ఏమైందో తెలుసా ?

కళ్లెంలేని గుర్రంతో జూనియర్ ఎన్టీఆర్ కవ్వింపులు చర్యలుకు పాల్పడుతున్నాడు. ఇంతకీ యంగ్ టైగర్ ఈ సాహంతో ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే మరి..

రాజమౌళి డైరక్షన్ లో ఆర్ఆర్ఆర్ చిత్రంలో  ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ బ్రిటీష్ పాలన నాటిది కావడంతో గుర్రాలపై స్వారీ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో  ట్రైనింగ్ లో భాగంగా సిద్ధంగా చేసిన గుర్రంతో జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఆటలు ఆడుతున్నాడట. 

 సివిల్ డ్రెస్ లో ఉన్న ఎన్టీఆర్ కళ్లెంలేని ఆ గుర్రాన్ని కవ్విస్తూ వెనక్కి గెంతుతుండగా  ఆ గుర్రం ఎన్టీఆర్ దిశగా వచ్చి ఒక్కసారిగా ముందుకాళ్లు గాల్లోకి లేపడం ఆ వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతం ఈ సీన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరు చూసి ఎంజాయ్ చేయండి.

 

 

Trending News