బాలీవుడ్‌లోనూ దుమ్మురేపుతున్న 'ఇస్మార్ట్ శంకర్'

ఈ రోజుల్లో 100 రోజుల పాటు సినిమా ఆడడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి ఘనతను పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్'  దక్కించుకుంది. చాలా కాలం తర్వాత 100 రోజులపాటు ఓ సినిమా ఆడడం విశేషం.

Last Updated : Feb 22, 2020, 09:04 AM IST
బాలీవుడ్‌లోనూ దుమ్మురేపుతున్న 'ఇస్మార్ట్ శంకర్'

ఈ రోజుల్లో 100 రోజుల పాటు సినిమా ఆడడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి ఘనతను పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్'  దక్కించుకుంది. చాలా కాలం తర్వాత 100 రోజులపాటు ఓ సినిమా ఆడడం విశేషం. 

అంతే కాదు 'ఇస్మార్ట్ శంకర్' మరో విశిష్టతను కూడా సాధించింది. రామ్ పోతినేని హీరోగా తెలుగులో తెరకెక్కిన ఈ సినిమాను హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. తెలుగులో ఘన విజయం సాధించడంతోపాటు హీందీలోనూ సినిమా దుమ్మురేపింది. ఈ సినిమా హిందీ వెర్షన్‌ను ఈ నెల 16న యూట్యూబ్‌లో విడుదల చేయగా..  5 రోజుల్లోనే 5 కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకుందంటే.. ఇది మామూలు విషయం కాదు.

ప్రసిద్ధ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 18 2019న విడుదలైంది. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ తోపాటు హీరోయిన్  చార్మీ   నిర్మాతలుగా వ్యవహరించారు. రామ్ పోతినేని, నభా నటేష్, నిధి అగర్వాల్, సత్యదేవ్, పునీత్ ఇస్సార్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ మ్యూజిక్ అందించారు. టిపికల్ కథాంశంతో సినిమా రూపుదిద్దుకోవడంతో ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించారు. తెలుగులో బాక్సాఫీస్ బద్దలు కొట్టిన తర్వాత .. బాలీవుడ్‌లోనూ సినిమా దుమ్మురేపింది.

Trending News