How To Get Rid Of A Stomach Ache In 5 Minutes: ప్రస్తుతం చాలామందిలో వివిధ రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల పొట్టలో సమస్యలు ఏర్పడడం సాధారణమైపోయింది. కడుపులో తిమ్మిర్లు, కడుపులో నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు ఎదుర్కొనే వారి సంఖ్య రోజుకి పెరుగుతూనే వస్తుంది. ప్రస్తుతం చాలామంది కడుపునొప్పులతో బాధపడుతున్నారు కొందరిలో అర్ధరాత్రి కూడా కడుపులో నొప్పులను అనుభవిస్తున్నారు. కడుపులో ఒక్కసారి నొప్పి మొదలైతే అది మిమ్మల్ని బాధ పెడుతూనే ఉంటుంది. అయితే ఈ సమస్య నుంచి తొందరగా బయటపడడానికి పలు చిట్కాలను పాటించాలని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఆ చిట్కాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
అల్లం:
అల్లంలో చాలా రకాల ఆయుర్వేద గుణాలు ఉంటాయి. అంతేకాకుండా దగ్గు జలుబు ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఉపయోగిస్తారు. అయితే ఇందులో ఉన్న గుణాలు కడుపునొప్పిని కూడా తగ్గిస్థాయి. వీటిని చిన్న ముక్కలుగా చేసుకొని టీ చేసుకుని తాగడం వల్ల పొట్టనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి తీవ్ర పొట్ట నొప్పులతో బాధపడేవారు తప్పకుండా ఈ చిట్కాలు ఉపయోగించండి.
మెంతులు:
మెంతుల్లో కూడా మంచి ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రించడానికి ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా శరీరాన్ని ఇతర వ్యాధులను రక్షించడానికి సహాయపడతాయి. కాబట్టి కడుపు నొప్పితో బాధపడుతున్న వారు వీటిని ఒక గిన్నెలో నానబెట్టుకున్న వాటి నుంచి తీసిన నీరుని తాగండి ఇలా చేస్తే.. చిటికెలో నొప్పి నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా వీటితో చేసిన పొడిని కూడా నీటిలో కలుపుకుని తాగొచ్చు. ఇలా చేస్తే తొందరగా ఉపసమనం లభిస్తుంది.
ఇంగువ:
ఆహార రుచులను పెంచేందుకు ఇంగువ ప్రధాన పాత్ర పోషిస్తుంది. భారతీయుల ప్రతి వంటకంలో ఇంగువను వినియోగిస్తారు. ఇంగువ పెంచడమే కాకుండా.. శరీరానికి మంచి ప్రయోజనాలను కూడా చేకూర్చుంది. ఇందులో శరీరానికి కావాల్సిన క్యాల్షియం, కాంప్లెక్స్ పిండి పదార్థాలు అధిక పరిమాణంలో ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేయడమే కాకుండా పొట్టనొప్పి నుంచి విముక్తి కలిగిస్తుంది. తీవ్ర పొట్ట నొప్పితో బాధపడుతున్న వారు తప్పకుండా తీసుకోండి.
పెరుగు:
మనం తరచుగా ఆహారాల్లో పెరుగును వాడుతూనే ఉంటాము. ఆహారం తిన్న తర్వాత తప్పకుండా పెరుగుతో చేసిన ఆహారాలను తీసుకుంటారు. ఇందులో ఉండే మూలకాలు కడుపు నొప్పి, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా విరోచనాలతో బాధపడుతున్న వారికి గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. కాబట్టి పొట్టలో సమస్యలతో బాధపడుతుంటే పెరుగును తప్పకుండా తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు..
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook