హీరో శ్రీకాంత్‌కు పితృ వియోగం

టాలీవుడ్ హీరో శ్రీకాంత్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి మేక పరమేశ్వర రావు మృతి చెందారు. నిన్న రాత్రి 11గంటల 45 నిముషాలకు తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో కొద్ది రోజులుగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Last Updated : Feb 17, 2020, 08:54 AM IST
హీరో శ్రీకాంత్‌కు పితృ వియోగం

టాలీవుడ్ హీరో శ్రీకాంత్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి మేక పరమేశ్వర రావు మృతి చెందారు. నిన్న రాత్రి 11గంటల 45 నిముషాలకు తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో కొద్ది రోజులుగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 

నిన్న రాత్రి పరిస్థితి విషమించడంతో చనిపోయారని వైద్యులు ధృవీకరించారు. 1948 మార్చి 16న జన్మించిన ఆయన . . కృష్ణా జిల్లాలోని మేకవారి పాలెంలో జన్మించారు. ఉద్యోగరీత్యా కర్ణాటకలోని గంగావతి జిల్లాకు వలస వెళ్లారు. ఆయనకు భార్య, కుమారులు శ్రీకాంత్, అనిల్, కుమార్తె నిర్మల ఉన్నారు.  ఆయన అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం మహా ప్రస్థానంలో నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

 

మరోవైపు పితృవియోగం చెందిన హీరో శ్రీకాంత్‌కు  పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. 

Trending News