కుందేటి కొమ్ము పేరు ఎప్పుడైనా విన్నారా..? ఇదేదో నాన్ వెజ్ పేరు అనుకొనేరు? కానేకాదు.. ఆయుర్వేద వైద్యులు వాడే ఓ అరుదైన మొక్క ఇది. దీని పత్రాలు, వేర్లు వల్ల కలిగే ఉపయోగాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా అనేకం. ఆంగ్లంలో కుందేటి కొమ్ము శాస్త్రీయ నామం కరొలెమా అడస్కాండెన్సిస్. ఈ రోజు మనం కూడా ఈ మొక్క వల్ల కలిగే మేలు ఏమిటో తెలుసుకుందాం..!
*ఆయుర్వేద వైద్యులు చాలామంది రోగుల కడుపు, ప్రేగుల్లో ఏర్పడే పుండ్ల నివారణకు కుందేటి కొమ్ము రసాన్ని తాగిస్తారని పలు గ్రంథాలు చెబుతున్నాయి.
*అలాగే ముసలితనం వల్ల వచ్చే ముడతలను కొంతవరకు నివారించడానికి కూడా కుందేటి కొమ్ము రసాన్ని తాగితే మంచిదని పలువురు వైద్యులు అంటున్నారు.
*స్థూలకాయ లక్షణాలు కనిపించిన ఎడల.. ఆ రుగ్మత బారి నుండి సాధ్యమైనంత త్వరగా బయటపడేందుకు కుందేటి కొమ్ము ఆకులను వేడినీటిలో మరగబెట్టి కషాయం చేసుకొని తాగాలన్నది కూడా పలువురి అభిప్రాయం.
*కుందేటి కొమ్ము కాకరకాయ మాదిరిగా చాలా చేదుగా ఉంటుంది. కానీ అనేక రుగ్మతలను నయం చేసే శక్తి దీనికి ఉందని పలు వైద్య గ్రంథాలు చెప్పడం విశేషం.
*నేడు గిరిజన వైద్యులు చాలామంది పసరు తయారీ కోసం వాడే మొక్కల్లో కుందేటి కొమ్ముకు కూడా పెద్ద పీట వేస్తున్నారు.
*మధుమేహ వ్యాధి నివారణకు కూడా కుందేటి కొమ్ము పనికొస్తుందని చెబుతుంటారు.
*అయితే ఈ కుందేటి కొమ్ముతో తయారయ్యే ఔషధాలను పరిమితంగా వాడడంతో పాటు.. ఆయుర్వేద వైద్యుల సూచనల మేరకే వాడడం మంచిది.
*కొన్ని వైద్య పద్ధతుల ప్రకారం, కుందేటి కొమ్ము రసాన్ని టీలో కూడా కలిపి సేవించవచ్చు. అలా చేయడం వల్ల కడుపులో మంట చల్లారుతుందట.
*జీర్ణశక్తి పెరగడానికి కూడా కుందేటి కొమ్ములను మిశ్రమంగా చేసి భుజించవచ్చు.