బిగ్ బాస్ 3 షో వివాదం: హేమపై యాంకర్ శ్వేతా రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

కమిట్‌మెంట్స్, అగ్రిమెంట్స్ మీకు పరిపాటి అయ్యుండొచ్చేమో కానీ తనకు కాదు: నటి హేమను ఉద్దేశించి శ్వేతా రెడ్డి కామెంట్స్

Last Updated : Jul 20, 2019, 11:27 PM IST
బిగ్ బాస్ 3 షో వివాదం: హేమపై యాంకర్ శ్వేతా రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

బిగ్ బాస్ షోలో తనను కంటెస్టెంట్‌గా తీసుకుని అగ్రిమెంట్ చేయించుకున్న తర్వాత తనకు అవకాశం ఇవ్వకుండా మోసం చేశారని శ్వేతా రెడ్డి అనే యాంకర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయమై ఆమె కోర్టును సైతం ఆశ్రయించారు. బిగ్ బాస్ 3 షోలో పాల్గొనే అవకాశం ఇవ్వకుండా మోసం చేయడం ఒక ఎత్తైతే, అవకాశం ఇస్తామని నమ్మబలికేందుకు తనను సంప్రదించిన ఇద్దరు ఇంచార్జ్‌లు తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తించి, వేధింపులకు పాల్పడ్డారనేది ఆమె చేస్తోన్న ప్రధాన ఆరోపణ. ఈ వివాదం ఇలా ఉండగానే రేపటి ఆదివారంనాడు బిగ్ బాస్ 3 సీజన్ తెరపైకి వెళ్లనుండటం ఆసక్తిరేకెత్తిస్తోంది.

ఇదిలావుండగా శ్వేతా రెడ్డి చేస్తోన్న ఆరోపణల గురించి నటి హేమ స్పందిస్తూ.. బిగ్ బాస్ షో హోస్ట్ నాగార్జున అటువంటి వారు కాదని, అనవసరంగా ఈ షోను అబాసుపాలు చేయొద్దని వ్యాఖ్యానించడం వెండితెర వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. నటి హేమ చేసిన ఈ కామెంట్స్ చూస్తే... ఆమె కూడా ఈ షోలో పాల్గొనే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. 

అయితే, హేమ చేసిన కామెంట్స్‌కి కౌంటర్ ఇచ్చిన శ్వేతా రెడ్డి.. ఇంకాస్త ఘాటుగానే స్పందించారు. హేమ లాగా బిగ్ బాస్ షోకి వెళ్లాలనే కక్కుర్తి తనకు లేదని అన్నారు. కమిట్‌మెంట్స్, అగ్రిమెంట్స్ మీకు పరిపాటి అయ్యుండొచ్చేమో కానీ తనకు కాదని శ్వేతా రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో వాడివేడీ చర్చలకు కేంద్ర బిందువుగా నిలిచి వార్తల్లోకెక్కిన హేమ ఈసారి శ్వేతారెడ్డి చేసిన కామెంట్స్‌పై ఏమని స్పందిస్తుందో మరి.

Trending News