Prateeksha: అమితాబ్ ఆవేదన..

ముంబయి మహానగరం గత కొన్ని రోజులుగా భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. నిరంతరంగా కురుస్తున్న వర్షాలకు వృక్షాలు సైతం నేలకొరుగుతున్నాయి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నివాసంలో కూడా ఓ గుల్ మొహర్ చెట్టు వేళ్లతో సహా పెకలించుకుని కూలిపోయింది.

Last Updated : Jul 5, 2020, 09:02 PM IST
Prateeksha: అమితాబ్ ఆవేదన..

ముంబై: ముంబయి మహానగరం గత కొన్ని రోజులుగా భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. నిరంతరంగా కురుస్తున్న వర్షాలకు వృక్షాలు సైతం నేలకొరుగుతున్నాయి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నివాసంలో కూడా ఓ గుల్ మొహర్ చెట్టు వేళ్లతో సహా పెకలించుకుని కూలిపోయింది. దాంతో ఆయన ఎంతో ఆవేదన చెందారు. తన బాధను అక్షరాల రూపంలో వెల్లడించారు. ముంబయిలో అమితాబ్ నివాసం పేరు ప్రతీక్ష. అమితాబ్ తండ్రి, ప్రముఖ కవి హరివంశ్ రాయ్ బచ్చన్ రాసిన ఓ కవిత పేరు ప్రతీక్ష. అమితాబ్ ఆ ప్రదేశాన్ని తన నివాసం పేరుగా పదిలపరుచుకున్నాడు. శ్రీలంక స్టార్ క్రికెటర్ అరెస్ట్

Also Read:  RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos 

ఎంతో ఇష్టంగా పెంచుకున్న గుల్ మొహర్ చెట్టు అంటే అమితాబ్ కు అపారమైన ప్రేమ. ఆ చెట్టుతో ఎన్నో ఆత్మీయ, అపురూప క్షణాలు ముడిపడి ఉన్నాయి. భారీ వర్షాలతో చెట్టు నేలకొరగడంతో ఆయన బాధను, విచారాన్ని బ్లాగ్ లో రాశారు. తన జీవితకాలం ఆ చెట్టు మాకు సేవలు అందించిందని, చివరకు వేర్లతో సహా కనుమరుగైపోయింది.ఈ గుల్ గుల్ మొహర్ చెట్టుతో తమకు 43 ఏళ్ల అనుబంధం ఉందని, 1976లో ముంబయిలో మా మొదటి ఇల్లు ప్రతీక్ష. అని పేర్కొన్నారు. కాగా మా ఇంట్లో ఏ శుభకార్యం అయినా, పండుగ అయినా, వేడుక అయినా ఆ చెట్టు వద్దే జరిగేవని, 2007లో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ పెళ్లి కూడా ఆ చెట్టు కిందే జరిగిందంటూ ఎన్నో మధురానుభూతులను పంచుకుంటూ తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు.

 జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    

Trending News