Nikhil Siddharth Marriage | టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి డాక్టర్ పల్లవి వర్మను నిఖిల్ వివాహమాడాడు. శామిర్ పేటలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో అత్యంత సన్నిహితుల మధ్య నిఖిత్, పల్లవి వర్మల వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం, శాస్త్రోక్తంగా జరిగింది. ఎంతో గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలని నిఖిల్ ఆశపడ్డాడు, కానీ కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా నిరాడంబరంగా వివాహం చేసుకోవాల్సి వచ్చింది. Photos: హీరో నిఖిల్ పెళ్లి ఫొటోలు
నేటి (మే 14న) ఉదయం 6 గంటల 31 నిమిషాలకు పెద్దలు నిశ్చయించిన సుముహార్తానికి నిఖిల్, పల్లవి వర్మ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హీరో నిఖిల్ డాక్టర్ పల్లవి వర్మకు కొన్నేళ్ల నుంచి పరిచయం ఉంది. నిఖిల్ తన ప్రేయను వ్యక్తం చేయగా పల్లవి వర్మ ఓకే చెప్పేసింది. ఫిబ్రవరి మొదటి వారంలో గోవాలో కొందరు సన్నిహితుల మధ్య ఎంగేజ్ మెంట్ జరిగింది. రానా దగ్గుబాటి లవర్ ఫొటోలు చూశారా!
ఏప్రిల్ 16న పెళ్లి ముహూర్తాన్ని ఇరు కుటుంబాలు నిశ్చయించాయి. అయితే లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో నిఖిల్ తన వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. దేశంలో లాక్‌డౌన్‌లు కొనసాగుతూనే ఉంటాయని, మరోవైపు మూఢం, శుభ ముహూర్తాలు అయిపోతున్నాయని భావించిన నిఖిల్ లాక్‌డౌన్‌లోనే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. పల్లవి వర్మ కుటుంబం కూడా ఓకే చెప్పడంతో మే 14న మరో శుభముహార్తానికి పెళ్లి ఫిక్స్ చేశారు. Photos: ప్రేయసితో హీరో నిఖిల్ నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్
శామిర్ పేటలోని ఫారెస్ట్ రిడ్జ్ రిసార్ట్‌లో అత్యంత సన్నిహితుల మధ్య భౌతిక దూరం (సోషల్ డిస్టాన్సింగ్) పాటిస్తూ నిఖిల్, పల్లవి వర్మ వివాహం చేసుకున్నారు. కాగా, హ్యాపీడేస్, స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సినిమాలతో నిఖిల్ విజయాలు అందుకున్నాడు. నిఖిల్ కెరీర్ ప్రస్తుతం సజావుగా సాగుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!