Abhishek Bachchan: అభిషేక్ బచ్చన్‌కి కరోనా పాజిటివ్

Abhishek Bachchan: అమితాబ్ బచ్చన్‌కి కరోనావైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయిన తర్వాత కొన్ని గంటల్లోనే ఆయన తనయుడు, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌కి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.

Last Updated : Jul 12, 2020, 03:16 AM IST
Abhishek Bachchan: అభిషేక్ బచ్చన్‌కి కరోనా పాజిటివ్

Abhishek Bachchan: అమితాబ్ బచ్చన్‌కి కరోనావైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయిన తర్వాత కొన్ని గంటల్లోనే ఆయన తనయుడు, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌కి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. అమితాబ్ బచ్చన్‌కి ( Amitabh Bachchan ) కరోనా పాజిటివ్ అని నిర్థారణ కావడంతో ఆయన కుటుంబసభ్యులు కూడా కరోనావైరస్ పరీక్షలు ( COVID-19 tests ) చేయించుకున్నారు. ఈ క్రమంలోనే అభిషేక్ బచ్చన్‌కి కూడా కరోనావైరస్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. ( Also read: Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్.. ఆస్పత్రిలో చికిత్స )

అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు ( COVID-19 treatment ). తనకు కరోనావైరస్ సోకినట్టు ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్న అమితాబ్.. కుటుంబసభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారని.. రిపోర్టులు రావాల్సి ఉందని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా గత 10 రోజులుగా తనను కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా బిగ్ బి కోరారు. ( Also read: Telangana: కొవిడ్-19 కేసులపై లేటెస్ట్ బులెటిన్ )

 

Trending News