Yamadheera Teaser: మగధీరను తలపిస్తోన్న 'యమధీర' మూవీ.. టీజర్ లాంచ్ చేసిన ప్రొడ్యూసర్ అశోక్ కుమార్..

Yamadheera Teaser: ఏ సినిమాకైనా టైటిలే ఇంపార్టెంట్. పేరును బట్టి అది ఎలాంటి సినిమా అనే దానిపై ప్రేక్షకులు ఒక అంచనాకు వస్తారు. కానీ కొన్ని సినిమాలు టైటిల్ తోనే ఆ సినిమాపై అటెన్ష్ క్రియేట్ చేస్తారు. తాజాగా ఈ కోవలో 'యమధీర' టైటిల్ ఆకట్టుకుంటోంది. మగధీర టైటిల్‌ను తలపిస్తోన్న ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ విడుదల చేశారు. 

Last Updated : Mar 15, 2024, 07:10 PM IST
Yamadheera Teaser: మగధీరను తలపిస్తోన్న 'యమధీర' మూవీ.. టీజర్ లాంచ్ చేసిన ప్రొడ్యూసర్ అశోక్ కుమార్..

Yamadheera Teaser: కన్నడ హీరో కోమల్ కుమార్ కథానాయకుడిగా.. భారత క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తోన్నసినిమా 'యమధీర'. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ నిర్మిస్తోన్న తొలి చిత్రం ఇది. ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో నాగబాబు, ఆలీ, సత్య ప్రకాష్, మధు సూధన్  తదితరులు నటించారు. అయితే ఈ సినిమా టీజర్ ప్రముఖ నటులు & ప్రొడ్యూసర్ అయిన అశోక్ కుమార్ లాంఛ్ చేసారు.  
ప్రొడ్యూసర్ వేదాల శ్రీనివాస్  మాట్లాడుతూ...ఇది తన మొదటి చిత్రం అని, సినిమాల మీద ప్యాషన్ తో శ్రీమందిరం ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసినట్టు చెప్పారు. ప్రేక్షకులు తమ ప్రయత్నాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. తన ఆహ్వానాన్ని మన్నించి వచ్చి యమధీర సినిమా టీజర్ లాంచ్ చేసిన తన స్నేహితుడు యాక్టర్, ప్రొడ్యూసర్ అయినటువంటి అశోక్ కుమార్‌కు థాంక్స్ చెప్పారు. త్వరలోనే యమధీర సినిమా థియేటర్లో రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

 
ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ...

తన స్నేహితులు వేదాల శ్రీనివాస్  కొత్తగా శ్రీమందిరం ప్రొడక్షన్స్ స్టార్ట్ చేయడం ఆనందంగా ఉందన్నారు. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో తొలి చిత్రంగా వస్తున్న యమధీర చాలా బాగా నడిచి కాసుల వర్షం కురిపించాలని ఆకాక్షించారు.కన్నడలో 90కు పైగా సినిమాలలో నటించిన కోమల్ కుమార్ ఈ సినిమాలో హీరోగా నటించడం విశేషం అని అన్నారు. క్రికెటర్ శ్రీశాంత్ ఫాస్ట్ బౌలర్ గా మైదానం లో చూపే   దూకుడు ని   ప్రతినాయకుడిగా చూపించారనే విషయం టీజర్‌ను చూస్తే తెలుస్తోంది. అలాగే ఈ చిత్రం అజర్ బైజాన్, శ్రీలంక వంటి దేశాలతో పాటు మన దేశంలోని మైసూర్, చెన్నై, బెంగళూరు ఇతర ప్రాంతాలలో షూటింగ్ జరగడం విశేషం అని తెలిపారు.

ప్రొడ్యూసర్ : వేదాల శ్రీనివాస్

తారాగణం :
కోమల్ కుమార్, శ్రీశాంత్ (క్రికెటర్), రిషీక శర్మ, నాగబాబు, ఆలీ, సత్య ప్రకాష్, మధు సూదన్, తదితరులు.

సంగీతం : వరుణ్ ఉన్ని
కథ & దర్శకత్వం : శంకర్ ఆర్

Read More: Viral News: ఇజ్జత్ తీశావ్ కదారా నాయన.. ప్లేట్ పావ్ భాజీ కోసం దేన్ని చోరీచేశాడో తెలిస్తే షాక్ అవుతారు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News