Wild Dog Movie: ఓటీటీ వేదికగా Akkineni Nagarjuna లేటేస్ట్ మూవీ వైల్డ్ డాగ్

Wild Dog Movie On Netflix | అహిషోర్ సోలోమాన్ దర్శకత్వంలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ సినిమా వైల్డ్ డాగ్. ఇటీవల విడుదలైన ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేశారు. నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో వైల్డ్ డాగ్ మూవీ వచ్చేసింది. ప్రముఖ పీఆర్వో బీఏ రాజు ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలిపారు.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 22, 2021, 01:35 PM IST
Wild Dog Movie: ఓటీటీ వేదికగా Akkineni Nagarjuna లేటేస్ట్ మూవీ వైల్డ్ డాగ్

Wild Dog Movie On Netflix: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రధానపాత్రలో తెరకెక్కిన మూవీ వైల్డ్ డాగ్. అహిషోర్ సోలోమాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్బంగా జనవరి 26న విడుదల చేయాలనుకున్నా, సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. నాగార్జున లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్ ఇటీవల ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. 

భారత్‌లో అతిపెద్ద అండర్ కవర్ ఆపరేషన్ కథాంశంగా వైల్డ్ డాగ్ మూవీ తెరకెక్కించింది. ఇటీవల విడుదలైన రియల్ స్టోరీకి సంబధించిన మూవీ వైల్డ్ డాగ్ ఇక మీరు వీక్షించవచ్చు. అదేంటీ థియేటర్లు మూసివేశారు. వైల్డ్ డాగ్ వీక్షించడం ఎలా అనుకుంటున్నారా, ఓటీటీ వేదికగా మీరు నాగార్జున(Nagarjuna) నటించిన వైల్డ్ డాగ్‌ మూవీని వీక్షించవచ్చు. నెట్ ఫ్లిక్స్(Netflix)లో ఈ మూవీ స్క్రీనింగ్ ప్రారంభమైందని టాలీవుడ్‌లో ప్రముఖ పీఆర్వో బీఏ రాజు ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు. గత ఏడాది రూ.27 కోట్లకు వైల్డ్‌డాగ్ డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని ప్రచారం సైతం జరిగింది. కానీ అనంతరం థియేటర్లలోనే సినిమా విడుదల కావడం తెలిసిందే. 

Also Read: Nagarjuna Latest Look: టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని వైల్డ్ డాగ్ లుక్ స్టిల్స్ వైరల్

వైల్డ్ డాగ్ మూవీలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఆఫీసర్ విజయ్ వర్మ పాత్రలో టాలీవుడ్ ‘మన్మథుడు’ నాగార్జున కనిపించారు. నాగార్జున (Actor Nagarjuna) ప్రధాన పాత్రలో ఇన్వెస్టిగేషన్ డ్రామాగా తెరకెక్కిన వైల్డ్‌డాగ్ సినిమా(Wild Dog Movie)ను నెట్‌ఫ్లిక్స్ వేదికగా వీక్షించండి. ఈ మూవీలో దియా మీర్జా, సయామి ఖేర్, అలీ రెజా, ఇతర కీలక పాత్రలు పోషించారు. అయితే ఆశించిన మేర వసూళ్లు రాబట్టలేకపోయింది.

Also Read: Dia Mirza wedding: బాయ్ ఫ్రెండ్‌ Vaibhav Rekhi ని రెండో పెళ్లి చేసుకున్న Dia Mirza  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News