Samantha Losing Chances: సమంతను ఆ నిర్మాతలు అందుకే పక్కన పెడుతున్నారా ?

Why Samantha is Losing Hindi Films:సమంతకు ఉన్న క్రేజ్ చూసి కొంతమంది బాలీవుడ్ నిర్మాతలు సమంతను కలిసి తమకు డేట్స్ ఇవ్వాల్సిందిగానూ కోరారట. సమంత కూడా అందుకు యస్ చెప్పిందని.. అయితే, ఆ చిత్రాలు స్టోరీ డిస్కషన్ స్టేజులో ఉండగానే ఆ నిర్మాతలు మళ్లీ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 20, 2022, 01:12 PM IST
  • సమంత కెరీర్ ట్రబుల్స్‌లో పడిందా ?
  • సమంతకు క్రేజ్ ఉన్నప్పుడు డేట్స్ అడిగిన వాళ్లే ఇప్పుడు ముఖం చాటేస్తున్నారా ?
  • సమంత చేస్తోన్న ఖుషీ మూవీ పరిస్థితి ఏంటి ?
Samantha Losing Chances: సమంతను ఆ నిర్మాతలు అందుకే పక్కన పెడుతున్నారా ?

Why Samantha is Losing Hindi Films: సమంత ఒకప్పుడు సౌతిండియాకే పరిమితమైన హీరోయిన్ అయినప్పటికీ.. పుష్ప మూవీలో " ఊ అంటావా మామా.. లేక ఉఊ అంటావా " అంటూ చేసిన స్పెషల్ సాంగ్‌తో యావత్ భారతీయులకు సుపరిచితురాలైంది. ఆ ఒక్క పాటతో సమంత టాలీవుడ్‌నే కాదు.. బాలీవుడ్‌ని కూడా ఒత ఊపు ఊపేసింది. ఇదేకాకుండా ది ఫ్యామిలీ మేన్ -2 వెబ్ సిరీస్‌లో సమంత పర్‌ఫార్మెన్స్‌కి బాలీవుడ్ ఫ్యాన్స్ కూడా ఫిదా అయ్యారు. ఇంకా చెప్పాలంటే అంతకంటే ముందు తమిళ, తెలుగు నుంచి హిందీలోకి డబ్బింగ్ అయిన చిత్రాలతో హిందీ ఆడియెన్స్‌కి సమంత ముందే పరిచయమైంది.

ఇవన్నీ ఇలా ఉంటే.. బాలీవుడ్ వర్గాలు చెబుతున్న టాక్ ప్రకారం.. సమంతకు ఉన్న క్రేజ్ చూసి కొంతమంది బాలీవుడ్ నిర్మాతలు సమంతను కలిసి తమకు డేట్స్ ఇవ్వాల్సిందిగానూ కోరారట. సమంత కూడా అందుకు యస్ చెప్పిందని.. అయితే, ఆ చిత్రాలు స్టోరీ డిస్కషన్ స్టేజులో ఉండగానే ఆమె మయోసైటిస్ అనే ఆటోఇమ్యూన్ వ్యాధితో బాధపడుతోందని.. చికిత్స తీసుకుంటోందని వార్తలు రావడంతో సదరు నిర్మాతలు వెనక్కి తగ్గారని తెలుస్తోంది. 

తనకు కొంత సమయం ఇవ్వాల్సిందిగా సమంత కోరినప్పటికీ.. ఇప్పటికే ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ కొన్ని పెండింగ్‌లో ఉండటంతో అవి పూర్తి చేసుకుంటే కానీ తమకు డేట్స్ ఇవ్వలేదని.. అప్పటి వరకు వేచిచూసే పరిస్థితి లేదని చెబుతూ బాలీవుడ్ నిర్మాతలు ఆమెకు సున్నితంగానే నో చెప్పారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఒకవేళ సమంతతో సినిమా మొదలుపెట్టిన తరువాత కూడా చికిత్స కారణంగా ఏవైనా అవాంతరాలు ఎదురైతే.. మళ్లీ సినిమా షూటింగ్‌కి బ్రేక్ ఇవ్వాల్సి వస్తుందనే భయం కూడా వారిని వెంటాడుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం సమంత చేస్తోన్న ఖుషీ మూవీ షూటింగ్ కూడా ఆమె చికిత్స కారణంగా కొంత బ్రేక్ తీసుకోక తప్పలేదు. అలా సమంత చేతి వరకు వచ్చిన హిందీ సినిమా అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయనే టాక్ వినిపిస్తోంది. 

సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ సినిమా చేస్తోంది. మజిలి మూవీ ఫేమ్ శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తోన్న ఈ రొమాంటిక్ కామెడీ మూవీ వాస్తవానికి డిసెంబర్ 23న విడుదల కావాల్సి ఉండగా.. సమంత తన చికిత్స కోసం అమెరికా వెళ్లడంతో చిత్రం షూటింగ్ ఆలస్యమైంది. దీంతో ఈ సినిమాను వచ్చే వేసవిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, సమంతలకు ఉన్న పాన్ ఇండియా క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మళయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. జయరాం, సచిన్ ఖేద్కర్, మురళి శర్మ, వెన్నెల కిషోర్, లక్ష్మి, రోహిణి, అలీ, రాహుల్ రామకృష్ణ తదితరులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా.. సమంత మళ్లీ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆశిద్దాం.

ఇది కూడా చదవండి : Pushpa Russia Release: 'పుష్ప' భజన మాములుగా లేదు కానీ.. మూడు కోట్లు లాసా?

ఇది కూడా చదవండి : Mohan Babu : పోలీసులు అధికారంలో ఉన్నవారికి తొత్తులు.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు!

ఇది కూడా చదవండి : Namrata-Mahesh Deal: పెళ్లికి ముందే ఆ డీల్ చేసుకున్న మహేశ్-నమ్రతా శిరోద్కర్, ఆ డీల్ ఏంటంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News