Prashanth Neel vs Rajamouli: తోపు దర్శకుడు ఎవరు? రాజమౌలి వర్సెస్ ప్రశాంత్ నీల్

KGF Director Prashanth Neel vs Bahubali RRR Director Rajamouli : కేజీఎఫ్ మూవీతో అందరి చూపులను తన వైపు తిప్పుకున్నాడు నీల్. ఎంతలా అంటే రాజమౌళికి కేవలం ‘కేజీయఫ్’తో ప్రశాంత్ నీల్ సవాల్ విసిరాడంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరేంటి?

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 22, 2022, 09:38 PM IST
  • కేజీఎఫ్ మూవీతో అందరి చూపులను తన వైపు తిప్పుకున్న నీల్
  • రాజమౌళికి కేవలం ‘కేజీయఫ్’తో ప్రశాంత్ నీల్ సవాల్
  • ఎవరు తోపు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ
Prashanth Neel vs Rajamouli: తోపు దర్శకుడు ఎవరు? రాజమౌలి వర్సెస్ ప్రశాంత్ నీల్

KGF Director Prashanth Neel vs Bahubali, RRR Director Rajamouli :  వయలెన్స్.. వయలెన్స్.. వయలెన్స్.. అంటూ కేజీఎఫ్ లో యష్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నోటా నానుతోంది. కేజీఎఫ్‌లో హీరో ఎలివేషన్ మాస్ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో మెప్పించిందో ఈ చిత్రంలో హీరో నటన,  డైలాగ్స్, ఫైట్స్ చూస్తే తెలుస్తుంది. దేశమంతా కేజీఎఫ్‌ ఫీవర్ ఇంకా కొనసాగుతోంది. కేవలం వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీతో ప్రశాంత్ నీల్‌కు ఎంత క్రేజ్ వచ్చిందంటే ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు డైరెక్టర్ ఎవరు అనే చర్చ జరిగే వరకు.

తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన దర్శకధీరుడు రాజమౌలి. బాహుబలితో భారతీయ సినిమా రేంజ్‌ను ప్రపంచానికి చాటాడు జక్కన్న. కలెక్షన్ల రికార్డులు సృష్టించిన బాహుబలి రాజమౌలి, ప్రభాస్‌, రానాలతో పాటు ఆ చిత్రానికి పని చేసిన ఎంతో మందికి క్రేజ్ తెచ్చిపెట్టింది. రాజమౌలిని భారతీయ సినీ దర్శకుల్లో అగ్రదర్శకుడుగా నిలబెట్టింది. బాహుబలి ఒక అద్భుత దృశ్యకావ్యం కాబట్టే అంతటి నీరాజనాలు పట్టారు ప్రేక్షకులు. కథ, కథనం వినూత్నంగా క్షణక్షణం ఆకర్షించేలా ప్రతి ఫ్రేమును అద్భుతంగా తీర్చిదిద్దుతాడు రాజమౌలి. అంతటి కేర్ తీసుకుంటాడు కాబట్టే రాజమౌలి అగ్రదర్శకుడిగా నిలబడ్డాడు. బాహుబలి తర్వాత, రీసెంట్‌గా వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో జక్కన్న స్టామినా ఏంటో మరోసారి నిరూపితమైంది. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లకు రాజమౌళి అనే బ్రాండ్ తోడై ఆర్ఆర్ఆర్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ దక్కిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అయితే ప్రస్తుతం దేశంలో నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌలి అనే స్థానానికి ప్రశాంత్ నీల్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా రైజ్ అయ్యాడు నీల్. కేవలం రెండో సినిమాతోనే ప్రశాంత్ దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. మరోవైపు బాహుబలి స్టార్ ప్రభాస్‌తో నీల్ తదుపరి సినిమా సలార్ 200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇప్పటికే కేజీఎఫ్‌తో పాన్ ఇండియా టాప్ డైరెక్టర్స్‌లో ఒకడి‌గా పేరు తెచ్చుకున్నాడు నీల్. కన్నడలో ఉగ్రం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ నీల్ రెండో సినిమా ‘కేజీయఫ్ చాప్టర్ 1’ తో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ఒక్క కన్నడలోనో, సౌత్‌లోనో కాదు.. యావత్ దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. కేజీఎఫ్1, 2 సినిమాలను తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా యష్‌ను ఎలివేట్ చేసిన విధానం సినిమా స్థాయిని అమాంతం ఆకాశానికి పెంచేసింది. డైలాగులు, నటన, సీన్స్ అన్నింటికీ తగిన విధంగా బ్యాగ్రౌండ్ స్కోర్... మాస్ ప్రేక్షకులకు పిచ్చిపిచ్చిగా నచ్చేలా చూపించాడు. ఈ కారణంగానే బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్2 దండయాత్ర కొనసాగుతోంది. కేజీఎఫ్ చాప్టర్ 2 హిందీ వెర్షన్ రాజమౌలి బాహుబలి 2 రికార్డు గల్లంతు చేసి.. టాప్ బాలీవుడ్ డే వన్ గ్రాసర్‌గా రికార్డులకెక్కింది. కేజీఎఫ్ 2 నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు పంచనుంది. రూ. 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది కేజీఎఫ్ చాప్టర్2. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 400కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

నిజానికి రాజమౌలి ఏళ్లకు తరబడి సినిమాలు చేస్తాడు. ముహూర్తం దగ్గర్నుంచి రిలీజ్ దాకా అన్నీ పక్కాగా ప్లాన్ చేస్తాడు. రూ. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ వేయి కోట్లు రాబట్టినా డిస్ట్రిబ్యూటర్స్ పెద్దగా లాభాలు పంచుకోలేదనే వాదన ఉంది. మరోవైపు కథలో దమ్ముంటే, అంతలా ఎక్స్‌ట్రా కేర్, సమయం తీసుకోవాల్సిన అవసరం లేకుండానే  బంపర్ హిట్ కొట్టొచ్చని ప్రశాంత్ నీల్ ప్రూవ్ చేశాడు. అందుకే ఇప్పుడు అందరి చూపులను తన వైపు తిప్పుకున్నాడు నీల్. ఎంతలా అంటే రాజమౌళికి కేవలం ‘కేజీయఫ్’తో ప్రశాంత్ నీల్ సవాల్ విసిరాడంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పోటీలో మరిన్ని మంచి సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులకు ఎనలేని వినోదం పంచాలని కోరుకుందాం.

Also Read : Allu Arjun on KGF 2: కేజీఎఫ్‌ 2పై అల్లు అర్జున్‌ ప్రశంసలు.. పుష్పరాజ్‌ రివ్యూ ఇదే!

Also Read : Sarkaru vaari paata update: మహేశ్ మూవీ నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. టైటిల్ సాంగ్ వచ్చేది రేపే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News