Naresh Pavitra Kiss సీనియర్ నటుడు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి, పవిత్రల ముక్కోణపు కథ ఆ మధ్య ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. బెంగళూరు హోటల్‌లో నరేష్ పవిత్రలు ఉంటే.. హోటల్ వద్దకు వెళ్లి రమ్య నానా హంగామా చేసింది. వారిని చెప్పుతో కొట్టబోయింది. అలా కన్నడ మీడియా మొత్తం కూడా నరేష్ పవిత్ర రమ్యల మీద ఫోకస్ పెట్టేసింది. తెలుగు మీడియాలోనూ నరేష్, రమ్య, పవిత్రల వ్యవహారం వైరల్ అయింది.
నరేష్ పవిత్రల న్యూ ఇయర్ సర్ ప్రైజ్ కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. తమ రిలేషన్‌ను కన్ఫామ్ చేస్తున్నట్టుగా లిప్ లాక్ పెట్టేసుకున్నారు. అప్పుడు అది సినిమా ప్రమోషన్ అని ఎవ్వరూ అంతగా అనుకోలేదు. అది నిజమైన ప్రకటన అని, పెళ్లి చేసుకుంటున్నారా? అని అంతా అనుకున్నారు. అందుకే ఇలా పబ్లిక్‌గా ముద్దులు కూడా పెట్టేసుకుంటున్నారని షాక్ అయ్యారు. అయితే అది మళ్లీ పెళ్లి అనే సినిమా ప్రమోషన్స్ అని తరువాత అర్థమైంది.
మళ్లీ పెళ్లి మే చివరి వారంలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్‌ను పీక్స్‌కు తీసుకెళ్లారు. మొన్నటి ప్రెస్ మీట్లోనూ నరేష్ తమ రిలేషన్ మీద చెప్పీ చెప్పినట్టుగా, క్లారిటీ ఇచ్చీ ఇవ్వనట్టుగా మాట్లాడాడు. పెళ్లి అంటే.. రెండు హృదయాల కలయిక అని చెప్పేశాడు. అంటే నరేష్ పవిత్రల హృదయాలు కలిసిపోయాయా? అన్నది అర్థం కాకుండా ఆన్సర్ ఇచ్చేశాడు సీనియర్ నటుడు.
Also Read: Paper Boy Director : అమ్మాయిల చేతుల్లోనే ఉంది.. కాస్టింగ్ కౌచ్ మీద డైరెక్టర్ కామెంట్లు వైరల్
ఈ ఇద్దరూ ఇప్పుడు సిక్స్త్ సెన్స్ షోకు గెస్టులుగా వచ్చారు. వచ్చీ రావడంతోనే నరేష్ పవిత్రలు రొమాన్స్ మొదలుపెట్టేశారు. పవిత్ర చేతికి నరేష్ ముద్దు పెట్టాడు. ఆకాశం ఊడిపడినా, భూమి బద్దలైనా ఈ చేతిని వదలను అంటూ రచ్చ చేశారు. ఇక నరేష్‌కు పవిత్ర ముద్దులు పెట్టేసింది. ప్రోమో చివర్లోనూ నరేష్ పవిత్రలు రెచ్చిపోయారు. నువ్ నన్ను నమ్ముతావా? ఓంకార్‌ని నమ్ముతావా? అని నరేష్ అడిగితే.. మిమ్మల్నే నమ్ముతాను అని పవిత్ర అంటుంది. నమ్మావ్ కదా?. జీవితాంతం నమ్ము అని డైలాగ్‌తో నరేష్ తనలోని రొమాంటిక్ కోణాన్ని బయటకు తీశాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook