విశాల్ ఎన్నికల అధికారిని బెదిరించాడా..?

తమిళ నటుడు విశాల్ నామినేషన్ విషయంలో మరో ఆసక్తికరమైన సంగతి వెలుగులోకి వచ్చింది. 

Last Updated : Dec 7, 2017, 04:51 PM IST
విశాల్ ఎన్నికల అధికారిని బెదిరించాడా..?

తమిళ నటుడు విశాల్ నామినేషన్ విషయంలో మరో ఆసక్తికరమైన సంగతి వెలుగులోకి వచ్చింది. ఆర్కే నగర్ నియోజకవర్గానికి జరుగుతున్న బైపోల్స్‌లో అభ్యర్థిగా విశాల్ వేసిన నామినేషన్‌ను ఇటీవలే ఎన్నికల అధికారులు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా రిటర్నింగ్ అధికారి విశాల్ పై ఆరోపణలు చేశారు. తనను బెదిరించి, నామినేషన్ స్వీకరించేలా ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆయన తెలిపారు.

అయితే విశాల్ ట్విట్టర్‌లో దీనికి వేరే విధంగా సమాధానం ఇచ్చారు. తన నామినేషన్ పత్రాలపై సంతకాలు పెట్టిన ఇద్దరు మద్దతుదారులు  దీపన్, సుమతి ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియడం లేదని.. వారి భద్రత పట్ల తనకు ఆందోళనగా ఉందని విశాల్ తెలిపారు. వారిని రెండు గంటల్లో తమ ముందు హాజరుపరచాలని ఈసీ తెలిపిందని.. అయితే సమయం మించిపోయిందని ఆయన ఈసీపై మండిపడ్డారు. ‘‘నా గెలుపు ఓటములతో సంబంధం లేదు... అయితే ప్రజాస్వామ్యం మాత్రం నిజంగా ఓడిపోయింది...’’ అని విశాల్ వ్యాఖ్యానించారు. పైగా తాము రిటర్నింగ్ ఆఫీసరుని బెదిరించామన్న విషయాన్ని విశాల్ ఖండించారు. 

 

Trending News