Vishal: 'మార్క్ ఆంటోని' ప్రతి టికెట్‌ నుంచి రూపాయి రైతుకే.. హీరో విశాల్ మంచి మనసు

Mark Antony Movie Success Meet: మార్క్ ఆంటోని మూవీ బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌కు బాగా నచ్చింది. ఈ చిత్రం సక్సెస్‌ మీట్‌లో విశాల్ మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రతి టికెట్‌ నుంచి ఒక రూపాయిని రైతులకు అందజేస్తామన్నాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 21, 2023, 09:00 PM IST
Vishal: 'మార్క్ ఆంటోని' ప్రతి టికెట్‌ నుంచి రూపాయి రైతుకే.. హీరో విశాల్ మంచి మనసు

Mark Antony Movie Success Meet: యాక్షన్ హీరో విశాల్, ఎస్‌జే సూర్య కాంబోలో రీసెంట్‌గా రిలీజ్ అయిన ‘మార్క్ ఆంటోని’ మూవీ బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఎస్‌.వినోద్ కుమార్ నిర్మించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా.. రీతూ వర్మ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. విశాల్, ఎస్‌జే సూర్య పోటాపోటీగా నటించి ఆడియన్స్‌ను మెప్పించింది. మంచి కలెక్షన్లు రాబడుతూ.. పాజిటివ్ టాక్‌ థియేటర్స్‌లో రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. 

ఈ సందర్భంగా హీరో విశాల్ మాట్లాడుతూ.. మార్క్ ఆంటోని మూవీని సక్సెస్ చేసినందుకు ఆడియన్స్‌కు థ్యాంక్స్ చెప్పాడు.  ప్రేక్షకులు టికెట్‌కు పెట్టిన డబ్బులకు సరిపడా వినోదం ఇచ్చినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ఎస్‌జే సూర్య అద్భుతంగా యాక్ట్ చేశారని కొనియాడారు. ప్రతీ సీన్‌కు ఆడియన్స్ పగలబడి నవ్వుతున్నారని.. సునీల్ కామెడీ ఓ మెడిసిన్ వంటిందని చెప్పాడు. కథ చెప్పినప్పుడే సూపర్ హిట్ అవుతుందని అనుకున్నానని.. అధిక్ చెప్పిన విధానం తనకు నచ్చిందన్నాడు. ఇక ఈ సినిమా ప్రతీ టికెట్ నుంచి ఒక రూపాయిని రైతులకు విరాళంగా అందజేస్తున్నట్లు విశాల్ తెలిపాడు.  

అనంతరం ఎస్‌జే సూర్య మాట్లాడుతూ.. మార్క్ ఆంటోని మూవీ సౌత్ ఇండియాలో దుమ్ములేపేస్తోందన్నాడు. కొత్త కాన్సెప్ట్‌తో సినిమా తీశామని.. ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారని చెప్పాడు. ఇంకా సినిమా చూడని ఆడిన్స్ తప్పకుండా చూడాలని కోరాడు. సినిమా ఎడిటింగ్ చాలా బాగుందని.. ఏ మాత్రం గందరగోళం లేకుండా ఎడిట్ చేశారని మెచ్చుకున్నాడు. విశాల్‌కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాడు. స్టోరీ తగినట్లు తన పాత్రకు స్పెస్‌ ఇచ్చారని తెలిపాడు. విశాల్ కెరీర్‌లో మార్కో ఆంటోని బిగ్గెస్ట్ హిట్ అవుతుందన్నాడు. విశాల్ ఆన్‌ స్క్రీన్‌లోనే కాకుండా.. ఆఫ్ స్క్రీన్‌లో కూడా హీరోనేనని అన్నాడు. తన డబ్బింగ్ బాగుందని అందరూ చెబుతుంటే హ్యాపీగా ఉందన్నాడు. సునీల్ ఇప్పుడు తెలుగుకే పరిమితం కాదని.. ఆయన తమిళంలో చేసిన ప్రతి సినిమా హిట్ అవుతోందన్నాడు.

తన జీవితాంతం గుర్తు పెట్టుకునే సినిమా మార్కో ఆంటోని అని సునీల్ చెప్పాడు. పేరుకు తగినట్లే.. విశాల్‌ది విశాలమైన మనసు అని అన్నాడు. ఎవరైనా వ్యాపారంలో షేర్ అడుగుతారని.. కానీ ఎస్‌జే సూర్య మాత్రం మంచి పనుల్లో షేర్ అడుగుతున్నారని చెప్పుకొచ్చాడు. తమిళం నేర్చుకోవడం కొత్తగా ఉందన్నాడు.

Also Read: Emergency Alert Message: మీ మొబైల్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా..? అసలు విషయం ఇదే..!

Also Read: Rahul Sipligunj: రతిక రోజ్‌తో పర్సనల్ పిక్స్‌పై స్పందించిన రాహుల్ సిప్లిగంజ్.. గుట్టురట్టు చేసేశాడు..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News