Laththi Day 1 Collections : విరిగిన విశాల్ 'లాఠీ'.. ఫస్ట్ డే ఎంత వసూల్ చేసిందంటే?

Vishal Laththi First Day Collections విశాల్ లాఠీ సినిమాకు తెలుగులో దారుణమైన ఫలితం వచ్చింది. ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. ఇక ఈ ప్రభావం సినిమా కలెక్షన్ల మీద పడింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2022, 05:24 PM IST
  • థియేటర్లోకి వచ్చిన విశాల్ లాఠీ
  • పరమబోరింగ్‌గా మారిన విశాల్ సినిమా
  • లాఠీకి దారుణమైన ఓపెనింగ్స్
Laththi Day 1 Collections : విరిగిన విశాల్ 'లాఠీ'.. ఫస్ట్ డే ఎంత వసూల్ చేసిందంటే?

Laththi Day 1 Collections విశాల్ సినిమాకు తెలుగులో మంచి డిమాండ్ ఉంటుంది. అయితే గత కొన్ని ఏళ్లుగా విశాల్ సినిమాలు ఏవీ ఇక్కడ ఆడటం లేదు. చివరగా అభిమన్యుడు, డిటెక్టెవి సినిమాలే ఆడాయి. మళ్లీ ఇంత వరకు ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఇప్పుడు లాఠీ అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అసలే కంటెంట్ వీక్‌ ఉందని అనుకుంటే.. విశాల్ మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. దీంతో లాఠీకి మొదటికే మోసం వచ్చినట్టు అయింది.

లాఠీ స్టోరీ, స్క్రీన్ ప్లే ఏది కూడా తెలుగు వారికి నచ్చినట్టుగా కనిపించడం లేదు. ఈ సినిమాకు రివ్యూలు కూడా దారుణంగా వచ్చాయి. ఆడియెన్స్ మౌత్ టాక్ కూడా లేకుండా పోయింది. దీంతో విశాల్ లాఠీ మొదటి ఆటకే తేలిపోయింది. అందుకే నిన్న అంతా కూడా లాఠీ థియేటర్లో వెలవెలబోయినట్టుగా కనిపిస్తోంది. దీంతో విశాల్ తన టార్గెట్, బ్రేక్ ఈవెన్‌ మార్కులకు అందనంత దూరంలో ఉండిపోయాడు.

ఈ సినిమాను తెలుగులో నాలుగు కోట్లకు తీసుకున్నట్టు తెలుస్తోంది. నాలుగున్నర కోట్లు వస్తే గానీ ఈ సినిమాను హిట్ అని చెప్పలేం. అయితే మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ వస్తాయని అంతా అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్‌ మీద చేసిన కామెంట్ల దెబ్బ సినిమాపై పడ్డట్టు కనిపిస్తోంది. దానికి తోడు సినిమాలో కథ కూడా ఏమీ లేకపోవడంతో కలెక్షన్లు పూర్తిగా నిల్‌ అయినట్టు తెలుస్తోంది.

ఈ సినిమాకు కోటి గ్రాస్ వరకు.. యాభై లక్షల షేర్ వచ్చినట్టు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉన్న విశాల్ ఈ రేంజ్‌ కలెక్షన్లను రాబట్టడం అంటే అది మరీ దారుణమనిపిస్తోంది. ఇక విశాల్ లాఠీ ఇక్కడ గట్టెక్కడం కష్టమే. ధమాకా, 18 pages సినిమాలకు మంచి టాక్ వచ్చింది. దీంతో లాఠీ మూలకు పడేట్టుంది.

Also Read : Manchu Family Pays Tribute to Kaikala : కైకాల మరణం.. ప్రశాంత్ నీల్ సంతాపం.. మంచు ఫ్యామిలీ ట్వీట్లు వైరల్

Also Read : Sneha Husband Prasanna : నువ్ పర్ఫెక్ట్ అని లవ్ చేశాను కానీ!.. విడాకులపై క్లారిటీ ఇచ్చేలా హీరోయిన్ స్నేహా పోస్ట్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News