Katrina Kaif Pregnancy: వైరల్‌ వీడియో.. తల్లికాబోతున్న స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్‌!

Katrina Kaif Pregnancy. ప్రస్తుతం బాలీవుడ్‌ హీరోయిన్‌ కత్రీనా కైఫ్‌కు సంబందించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాట్ ప్రెగ్నెంట్‌ అంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 12, 2022, 05:02 PM IST
  • 2021 డిసెంబర్‌ 9న వివాహం
  • తల్లికాబోతున్న కత్రీనా కైఫ్‌
  • ప్రెగ్నెంట్‌ అంటూ నెట్టింట వార్తలు
Katrina Kaif Pregnancy: వైరల్‌ వీడియో.. తల్లికాబోతున్న స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్‌!

Bollywood Actress Katrina Kaif latest look sparks pregnancy rumours: బాలీవుడ్‌ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్‌, విక్కీ కౌశల్‌ గతేడాది వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2021 డిసెంబర్‌ 9న రాజస్తాన్‌లోని సవాయ్ మాధోపూర్ సిక్స్ సెన్సెస్ కోటలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఇద్దరి స్టార్లకు సంబంధించిన పెళ్లి వార్తలు అప్పుడు దేశవ్యాప్తంగా హైలైట్‌ అయ్యాయి. ఇక వివాహం అనంతరం ఈ స్టార్ కపుల్ తమ హనీమూన్‌ను మాల్దీవుల్లో ప్లాన్‌ చేశారు. ఆ తర్వాత ఈ జంట పలు వెకేషన్స్‌కు వెళ్లింది. ప్రస్తుతం విక్కీ, కత్రినా తమతమ సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. 

అయితే ప్రస్తుతం బాలీవుడ్‌ హీరోయిన్‌ కత్రీనా కైఫ్‌కు సంబందించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాట్ ప్రెగ్నెంట్‌ అంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. టైగర్ 3, మెర్రీ క్రిస్మస్ షూటింగ్‌లో బిజీగా ఉన్న కత్రినా.. సోమవారం ముంబై విమానాశ్రయం నుంచి బయటకు వచ్చారు. కారు వద్దకు వెళుతున్న సమయంలో కత్రీనాను పలువురు ఫోటో గ్రాఫర్లు ఫొటోలు, వీడియోలు తీశారు. ఓ వీడియోను ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ వైరల్ భయానీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వైరల్ భయానీ పోస్ట్ చేసిన వీడియోలో కత్రీనా కైఫ్‌.. పాస్టెల్ పింక్ చుడిదార్ వేసుకున్నారు. వీడియోలో కాట్ కొంచెం బొద్దుగా ఉన్నారు. అంతేకాదు ఆమె నడక తీరు కూడా వేరేలా ఉంది.  దాంతో కత్రీనా ప్రెగ్నెంట్‌ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 'ఓహ్ మై గాడ్.. కత్రీనా ప్రెగ్నెంట్‌లా ఉంది?' అని ఒకరు కామెంట్ చేయగా.. 'త్వరలో కాట్ తల్లి కాబోతుంది. కత్రీనా పాపను చూడాలని ఆతృతగా ఉంది' అని ఇంకొకరు ట్వీట్ చేసారు. కాట్ నిజంగానే తల్లికాబోతుందా? లేదా డ్రెస్ వల్ల అలా కనిపిస్తోందో తెలియాలంటే.. మరికొన్ని రోజులు వేచిచూడక తప్పదు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

సల్మాన్ ఖాన్ నటించిన స్పై థ్రిల్లర్ 'టైగర్ 3'లో కత్రీనా కైఫ్‌ నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 21, 2023న విడుదల అవనుంది. ఈ చిత్రం హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో విడుదల కానుంది. జీ లే జరా, మెర్రీ క్రిస్మస్ సినిమాలు కూడా చేస్తున్నారు. కత్రీనా కైఫ్‌ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపపరిచితమే. మల్లీశ్వరి, అల్లరిపిడుగు సినిమాలు చేసిన తర్వాతే కాట్ బాలీవుడ్ వెళ్లి సెటిల్ అయ్యారు. 

Also Read: Yash KGF 2: యశ్ 'కేజీఎఫ్ 2'కి తెలంగాణ సర్కార్ బంపరాఫర్... టికెట్ రేట్లు పెంచుతూ జీవో...

Also Read: Flipkart Sale: iPhone 13 Miniపై ఫ్లిప్ కార్ట్ భారీ తగ్గింపు.. ఆఫర్ ఇంకొక్క రోజు మాత్రమే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News