మహానటి సినిమాలో విజయ్ ఆంటోనిగా కనిపించిన విజయ్ దేవరకొండ... ఇంత గొప్ప సినిమాలో చిన్న రోల్ ప్లే చేయగలిగినందుకు చాలా హ్యాప్పీగా ఫీలవుతున్నానని ఆనందం వ్యక్తంచేశాడు. ఈ సినిమాలో తన రోల్ గురించి, దుల్కర్ ప్లే చేసిన జెమినీ గణేషన్ చుట్టూ జరిగిన ఇంట్రెస్టింగ్ విషయాలను విజయ్ దేవరకొండ షేర్ చేసుకున్నాడు. ఆ విశేషాలు మీకోసం…
నా ఇమ్మీడియట్ రియాక్షన్ అదే…
నాగ్ అశ్విన్ నాకు ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కాబట్టి న్యాచురల్‌గానే తనతో ఒక బాండింగ్ ఉంది. ఎప్పుడైతే 'మహానటి' సినిమా గురించి నాగి చెప్పాడో, ఎలాగైనా ఆ సినిమాలో పార్ట్ అయి, ఆ సినిమాకి హెల్ప్ చేయాలని స్ట్రాంగ్‌గా ఫీల్ అయ్యా.
చాలా చిన్న పాత్ర…
'మహానటి'లో నాది చాలా చిన్న పాత్ర. సావిత్రి గారి స్టోరీని రీసెర్చ్ చేసి చెప్పడానికి సపోర్ట్ చేసే క్యారెక్టర్. అయినా నేను ఈ సినిమాలో పార్ట్ అయినందుకు ఎంతో హ్యాప్పీగా ఫీలవుతున్నా. ఇలాంటి సినిమాలు మళ్ళీమళ్ళీ రావు.
నా సినిమా కాదు…
'మహానటి' నా సినిమా కాదు. అర్జున్ రెడ్డిని చూడటానికో, విజయ్ దేవరకొండను చూడటానికో 'మహానటి' సినిమా చూడాలనుకోవద్దు. ఇది సావిత్రి గారి సినిమా. ఈ సినిమాలో నేను జస్ట్ చిన్న సపోర్టింగ్ రోల్ చేశాను. అంతే.
విజయ్ ఆంటోని గురించి…
సినిమాలో విజయ్ ఆంటోని అంటే సమంత ప్లే చేసిన మధురవాణి క్యారెక్టర్‌కి సపోర్టింగ్ రోల్. సమంతా ఫర్ఫామెన్స్ చాలా బావుంటుంది సినిమాలో…
జెమినీ గణేషన్ కోసం నన్ను అప్రోచ్ అయ్యారు…
జెమినీ గనేషన్ క్యారెక్టర్ కోసం ఫస్ట్ దుల్కర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓకె అని చెప్పినా, ఆ తరవాత షూటింగ్ డిలే అవ్వడంతో, ఆ తర్వాత డేట్స్‌ని దుల్కర్ తొందరగా కన్ఫమ్ చేయలేకపోయాడు. అపుడు నాగి నాకు కాల్ చేశాడు. దుల్కర్ చేయకపోతే అది నేనే చేయాలి అని నాగి చెప్పాడు…
దుల్కర్ నన్ను సేవ్ చేశాడు…
నాగి జెమినీ గణేషన్ క్యారెక్టర్ ఆఫర్ చేసినప్పుడు ఒక్కసారిగా డైలమాలో పడ్డా… జెమినీ గనేషన్ క్యారెక్టర్ అంటే మినిమం 1 మంత్ ప్రిపరేషన్స్ ఉండాలి. నా దగ్గర అంత టైమ్ లేదు.. అలాగని నో అనే చెప్పే ధైర్యమూ లేదు…రేపు సినిమా రిలీజయ్యాక అయ్యో నో అని చెప్పానే అనే గిల్టీ ఫీలింగ్ ఇమాజిన్ చేసుకుంటేనే బాలేదు. అప్పుడు దుల్కర్ నన్ను సేవ్ చేశాడు.
నాగి కాల్ చేయడంతో రిలాక్సింగ్‌గా ఫీల్ అయ్యా…
ఒకరోజు నాగి నాకు కాల్ చేసి దుల్కర్, జెమినీ గణేషన్ రోల్‌కి ఓకే చెప్పాడు. నువ్వు ఆంటోనిగా ఫిక్సయిపో అన్నాడు… అప్పుడు కానీ రిలాక్సింగ్ అనిపించలేదు.