katrina kaif secret engagement: విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ సీక్రెట్ ఎంగేజ్మెంట్ రూమర్స్

Vicky Kaushal secret engagement: with katrina kaif: వికీ కౌశల్‌‌తో కత్రినా కైఫ్‌కి ఎంగేజ్‌మెంట్ జరిగిందనే రూమర్స్‌పై కత్రినా కైఫ్ పీఆర్ టీమ్ స్పందించింది. వికీ కౌశల్‌, కత్రినా కైఫ్‌ ఎంగేజ్‌మెంట్ రూమర్స్‌పై వికీ కౌశల్ తండ్రి శామ్ కౌశల్ కూడా స్పందించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 19, 2021, 12:55 AM IST
katrina kaif secret engagement: విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ సీక్రెట్ ఎంగేజ్మెంట్ రూమర్స్

Vicky Kaushal secret engagement with katrina kaif: విక్కి కౌశల్, కత్రినా కైఫ్ ఇద్దరూ సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. బాలీవుడ్ లవ్ బర్డ్స్‌గా పేరొందిన వికీ కౌశల్, కత్రినా కైఫ్ బుధవారం రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయని వైరల్ భయాని (Viral Bhayani) సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టడంతో పాటు ఈ ఎంగేజ్మెంట్‌పై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనందున ప్రస్తుతానికి దీనిని ఓ రూమర్‌గానే భావించాల్సి ఉంటుందని అందులో పేర్కొన్నాడు. 

సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌పై స్పందిస్తున్న విక్కీ కౌశల్ అభిమానులు, కత్రినా కైఫ్ ఫ్యాన్స్.. ఆ ఇద్దరికీ కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు, కామెంట్స్ పెడుతున్నారు. వికీ కౌశల్‌‌తో కత్రినా కైఫ్‌కి ఎంగేజ్‌మెంట్ (Katrina Kaif roka ceremony) జరిగిందనే రూమర్స్‌పై కత్రినా కైఫ్ పీఆర్ టీమ్ స్పందించింది. ఈ రూమర్స్‌లో నిజం లేదని కత్రినా కైఫ్ టీమ్ స్పష్టంచేసింది. 

వికీ కౌశల్‌, కత్రినా కైఫ్‌ ఎంగేజ్‌మెంట్ రూమర్స్‌పై వికీ కౌశల్ తండ్రి శామ్ కౌశల్ (Vicky Kaushal’s father Sham Kaushal) కూడా స్పందించారు. ఎంగేజ్మెంట్ రూమర్స్‌పై శామ్ కౌషల్ మీడియాతో మాట్లాడుతూ.. ఆ కథనాల్లో నిజం లేదని తెలిపారు. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ప్రస్తుతం చేస్తోన్న సినిమాల విషయానికొస్తే... విక్కీ ప్రస్తుతం 'ది ఇమ్మోర్టల్ అశ్వథ్థామ', 'సర్ధార్ ఉద్ధమ్ సింగ్', 'శామ్ బహదూర్', 'ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ' వంటి చిత్రాలతో బిజీగా ఉన్నాడు.

అలాగే కత్రినా కైఫ్ ప్రస్తుతం టైగర్ 3 సినిమా చేస్తోంది. సల్మాన్ ఖాన్ (Salman Khan), ఇమ్రాన్ హష్మీ లీడ్ రోల్స్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ కోసం త్వరలోనే కత్రినా కైఫ్ (Katrina Kaif) రష్యా వెళ్లనుంది.

Trending News