Sreenu Vaitla: ఒకప్పుడు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్ లలో శ్రీను వైట్ల పేరు కూడా మొదటి వరుసలోనే ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో శ్రీను వైట్ల పేరు ఏమాత్రం వినపడటం లేదు. ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద వరుస బ్లాక్ బస్టర్ లు అందుకున్న శ్రీను వైట్ల ఈ మధ్యకాలంలో అసలు సినిమాలు చేయడమే మానేశారు.
2011లో మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు సినిమా తర్వాత శ్రీను వైట్ల కెరియర్ లో పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలేవి లేవు. 2014లో మహేష్ బాబు హీరోగా వచ్చిన ఆగడు, 2018 లో రవితేజ తో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు డిజాస్టర్లు గా నిలిచాయి.
తాజాగా ఇప్పుడు శ్రీను వైట్ల మ్యాచో స్టార్ గోపీచంద్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో కచ్చితంగా హిట్ అందుకుంటానని శ్రీను వైట్ల గట్టిగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది.
అయితే తాజాగా మీడియా ముఖంగా మాట్లాడుతూ వెంకీ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు హింట్ ఇచ్చారు శ్రీనువైట్ల. 2004లో రవితేజ హీరోగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ వెంకీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
సినిమా విడుదల అయ్యి 20 ఏళ్లు గడుస్తున్నా కూడా ఇప్పటికీ సినిమాలోని కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. ముఖ్యంగా ఎంతోమంది మీమర్ లకి శ్రీను వైట్ల డైరెక్షన్ చేసిన ఈ సినిమా పెద్ద ఇన్స్పిరేషన్. ముఖ్యంగా సినిమాలో ట్రైన్ సన్నివేశానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
అలాంటి ఒక సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ అంటే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. కానీ గత కొంతకాలంగా శ్రీను వైట్ల ఒక్క హిట్టు కూడా అందుకోలేదు. అలాంటి ఒక ఫ్లాప్ డైరెక్టర్ తో రవితేజ సీక్వల్ సినిమా ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుంది అని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు రవితేజ కూడా వరుస డిజాస్టర్ తో సతమతమవుతున్నారు. ఈ సమయంలో శ్రీనువైట్ల వంటి ఫ్లాప్ డైరెక్టర్ తో రవితేజ చేతులు కలుపుతారా లేదా అని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే రవితేజ కెరియర్ మొదట్లో నీకోసం సినిమా.. వెంకీ తరువాత దుబాయ్ శ్రీను లాంటి సినిమా అందించింది కూడా శీను వైట్ల కావడం విశేషం. మరి అవన్నీ గుర్తు పెట్టుకొని రవితేజ సై అంటారా.. లేదా అమర్ అక్బర్ ఆంటోనీలా మరో చేదు అనుభవం ఎదురుకాకూడదు అని నో అంటారా తెలియాలి అంటే ఈ విషయంపై రవితేజ స్పందించే వరకు వేచి చూడాలి.
Also Read: Love Guru Trailer: 'లవ్‌గురు'తో వస్తున్న బిచ్చగాడు హీరో.. ట్రైలర్ చూస్తే నవ్వులే
Also Read: Whatsapp New Feature: వాట్సప్ AI ఫోటో ఎడిటింగ్ ఫీచర్, ఎలా పనిచేస్తుందంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
రవితేజ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేసిన ఫ్లాప్ డైరెక్టర్.. ఇలాంటి పరిస్థితుల్లో!