Saindhav TV Premier: టీవీ ప్రీమియర్ కు రెడీ అయిన వెంకటేష్ సైంధవ్ మూవీ.. ఎపుడు ఎక్కడంటే..

Saindhav TV Premier: విక్టరీ వెంకటేష్ గతేడాది 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' మూవీతో పలకరించారు. చాలా యేళ్ల తర్వాత హిందీలో సల్మాన్ ఖాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వత సోలో హీరోగా 'సైంధవ్' మూవీతో పలకరించారు. సంక్రాంతి కానుకగా విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్ అయింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 6, 2024, 01:59 PM IST
Saindhav TV Premier: టీవీ ప్రీమియర్ కు రెడీ అయిన వెంకటేష్ సైంధవ్ మూవీ.. ఎపుడు ఎక్కడంటే..

Saindhav TV Premier:: హీరో వెంకటేష్‌ రీసెంట్‌గా 'సైంధవ్' మూవీతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం అందుకోలేదు.
ఇక 'సైంధవ్' మూవీ విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో 75వ చిత్రం. ఈయన కెరీర్‌లో లాండ్ మార్క్ మూవీగా  నిలిచిపోతుందనుకున్న మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్ని అందుకుంది.స్టైలిష్‌ యాక్షన్ ఎంటర్టేనర్‌ అంటూ ప్రచారం చేసినా పెద్దగా ఫలితం లేకపోయింది. ఈ మూవీ కాన్సెప్ట్ బాగున్నా.. సంక్రాంతి సినిమాల్లో శాండ్‌విచ్ అయిపోయింది. విడుదలైన వారం రోజుల్లోనే పెట్టా బేడా సర్ధుకొని థియేటర్స్ నుంచి వెళ్లిపోయింది. ఈ మూవీ గతేడాది చివర్లో విడుదల కావాల్సిన ఈ మూవీ ప్రభాస్ 'సలార్' కారణంగా  సంక్రాంతి వంటి తీవ్ర పోటీలో విడుదలైంది. అయితే పండగ సీజన్‌లో   హనుమాన్, గుంటూరు కారం వంటి సినిమాలతో నాగార్జున హీరోగా నటించిన 'నా సామి రంగ' సినిమాలు విడుదలయ్యాయి. ఈ సినిమాల మధ్య సైంధవ్ పూర్తిగా నలిగి నుజ్జు నుజ్జు అయిపోయింది.  

ఈ మూవీలో యాక్షన్ కమ్ పాప సెంటిమెంట్ ఎక్కువగా ఉండటంతో ఓ జానర్ ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. మరోవైపు ఈ సినిమాలో  ఉన్న విపరీతమైన హింస కారణంగా ఈ మూవీ సంక్రాంతి పోటీలో అడ్డంగా బుక్కైపోయింది.తన బేస్ కుటుంబ ప్రేక్షకులకు దూరంగా ఈ సినిమా ఉండటం సైంధవ్‌కు ప్రతికూలంగా మారింది.

ఇక 'సైంధవ్' సినిమా వెంకటేష్ కు 75వ సినిమా. తన లాండ్ మార్క్ చిత్రాన్ని డైరెక్టర్ శైలేష్ కొలను స్టైలిష్ యాక్షన్ ఎంటర్టేనర్‌గా  తెరకెక్కించినా.. హీరోకు విలన్స్ ఎందుకు భయపడతారనే విషయాన్ని తెరపై కన్విన్స్‌గా చెప్పడంలో తడబడ్డాడు.  తన గత రెండు చిత్రాలు 'హిట్ -1, హిట్ -2 చిత్రాలను పోలీస్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించిన శైలేష్ కొలను.. ఈ చిత్రాన్ని మాఫియా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించాడు.

ముఖ్యంగా ఇలాంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టేనర్‌లను ఏ సినిమా ఎలాంటి పోటీ లేకుండా విడుదల  చేస్తే మంచి ఫలితం అయినా దక్కేది. కానీ సంక్రాంతి సీజన్ అంటూ ఎగబడి మొత్తానికి ఎసరు తెచ్చుకున్నారు.ఏది ఏమైనా తన కెరీర్‌లో లాండ్ మార్క్ మూవీగా నిలిచిపోతుందనున్న 'సైంధవ్' వెంకటేష్‌కు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఈ మూవీలో ఇతర ముఖ్యపాత్రల్లో నవాజుద్దీన్ సిద్దిఖీ, ముఖేష్ రుషి, జిషుసేన్ గుప్తా నటించారు. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్,రుహాని శర్మ, ఆండ్రియా ఫీమేల్ లీడ్ పాత్రల్లో కనిపించారు. మొత్తంగా రూ. 30 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ కనీసం రూ. 10 కోట్ల షేర్ రాబట్టలేపోయింది.

ప్రస్తుతం సైంధవ్ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ ఈ సినిమాకు ఓ మోస్తరు రెఅయినా పెద్దగా వర్కౌట్ కాలేదు.స్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా టీవీ ప్రీమియర్‌కు అంతా రెడీ అయింది. ఈ సినిమాను ఈ నెల 10 ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈటీవీలో ప్రసారం కానుంది. మరి థియేటర్స్‌లో అంతగా ప్రేక్షకాదరణ పొందని ఈ సినిమా టీవీలో ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.

ఆ సంగతి పక్కన పెడితే.. వెంకటేష్ ఇపుడు మరోసారి హాట్రిక్ కాంబినేషన్‌కు రెడీ అవుతున్నట్టు సమాచారం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో మరో మూవీకి ఓకే చెప్పినట్టు సమాచారం. మహా శివరాత్రి కానుకగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమాకు 'సంక్రాంతి వస్తున్నాం' అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. అందులో నిజం ఎంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిల్ చేయాల్సిందే.

Also read: Tax Free Incomes: ఈ 5 రకాల ఆదాయాలపై ట్యాక్స్ ఉండదని మీకు తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News