Venkatesh - Saindhav: అయ్యో అయ్యో అయ్యయ్యో.. సంక్రాంతి సినిమాల్లో శాండ్‌విచ్ అయిపోయిన వెంకటేష్ 'సైంధవ్'..

Venkatesh - Saindhav: సంక్రాంతి సినిమాల్లో అందరి అంచనాలు తలకిందలు చేస్తూ డిజాస్టర్ అయిన సినిమా సైంధవ్. ఈ మూవీ పొంగల్ పోటీలో మిగతా సినిమాల పోటీ తట్టుకోలేక శాండ్ విచ్ అయిపోయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2024, 08:23 AM IST
 Venkatesh - Saindhav: అయ్యో అయ్యో అయ్యయ్యో.. సంక్రాంతి సినిమాల్లో శాండ్‌విచ్ అయిపోయిన వెంకటేష్ 'సైంధవ్'..

Venkatesh - Saindhav: విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'సైంధవ్'. గతేడాది చివర్లో విడుదల కావాల్సిన ఈ మూవీ ప్రభాస్ 'సలార్' కారణంగా సంక్రాంతికి వాయిదా పడింది. అయితే సంక్రాంతి సినిమాల్లో హనుమాన్, గుంటూరు కారం వంటి సినిమాలతో పాటు తన తరం హీరో నాగార్జున హీరోగా నటించిన 'నా సామి రంగ' సినిమాలు విడుదలయ్యాయి. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'సైంధవ్' మూవీకి మంచి టాక్ వచ్చినా.. సంక్రాంతి సినిమాల్లో పోటీ కారణంగా ముఖ్యంగా ప్రశాంత్ వర్మ.. హను మాన్‌తో పాటు మహేష్ బాబు, త్రివిక్రమ్‌ల 'గుంటూరు కారం' సినిమాల మధ్య నలిగిపోయింది. అటు నాగార్జున నటించిన 'నా సామి రంగ' సినిమా పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమాగా విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక వెంకటేష్ నటించిన సైంధవ్ విషయానికొస్తే.. ఈ మూవీలో యాక్షన్ కమ్ పాప సెంటిమెంట్ పాళ్లు ఎక్కువగా ఉన్న విపరీతమైన హింస కారణంగా ఈ మూవీ సంక్రాంతి పోటీలో చతికిలబడింది. తన బేస్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు దూరంగా ఈ సినిమా ఉండటం సైంధవ్‌కు మైనస్‌గా మారింది.

ఇక 'సైంధవ్' సినిమా వెంకటేష్ కు 75వ సినిమా. తన లాండ్ మార్క్ మూవీని దర్శకుడు శైలేష్ కొలను బాగానే తెరకెక్కించినా.. హీరోకు విలన్స్ ఎందుకు భయపడతారనే విషయాన్ని తెరపై కన్విన్స్‌గా చెప్పడంలో విఫలమయ్యాడు. తన గత రెండు చిత్రాలు 'హిట్ -1, హిట్ -2 చిత్రాలను పోలీస్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించిన శైలేష్ కొలను.. ఈ చిత్రాన్ని మాఫియా బ్యాక్ డ్రాప్‌లో సరికొత్తగా ప్రెజెంట్ చేసినా.. పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ముఖ్యంగా ఇలాంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టేనర్‌లను సోలోగా రిలీజ్ చేస్తే మంచి ప్రయోజనం అయినా దక్కేది. కానీ సంక్రాంతి సీజన్ అంటూ ఎగబడి మొత్తానికి ఎసరు తెచ్చుకున్నారు. ఏది ఏమైనా తన కెరీర్‌లో లాండ్ మార్క్ మూవీగా నిలిచిపోతుందనున్న 'సైంధవ్' వెంకటేష్‌కు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఈ మూవీలో ఇతర ముఖ్యపాత్రల్లో నవాజుద్దీన్ సిద్దిఖీ, ముఖేష్ రుషి, జిషుసేన్ గుప్తా నటించారు. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ ఫీమేల్ లీడ్ పాత్రల్లో కనిపించారు.  

ఇక ప్రేక్షకులకు సంక్రాంతి సీజన్‌లో హనుమాన్, గుంటూరు కారం, నా సామి రంగ సినిమాలు ఆప్షన్‌గా ఉండటం కూడా వెంకటేష్ 'సైంధవ్' మూవీకి మహా భారతంలో  సైంధవుడిలా  అడ్డుపడ్డాయనే చెప్పాలి. మొత్తంగా సంక్రాంతి సీజన్‌లో విడుదలైన వెంకటేష్ మెజారిటీ చిత్రాలు మంచి విజయాలనే నమోదు చేసాయి. కానీ సైంధవ్ మాత్రం సంక్రాంతి పోటీల్లో శాండ్‌విచ్ అయిపోయింది. అది కలెక్షన్స్ రూపంలో కనపడింది. అసలు ప్రేక్షకులు కూడా ఈ మూవీ వైపు కన్నెత్తి చూడలేదు. మొత్తంగా రూ. 30 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ కనీసం రూ. 10 కోట్ల షేర్ రాబట్టలేక చతికిల బడింది. ఈ నేపథ్యంలో ఈ మూవీని విడుదలైన రెండు వారాల్లోనే ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్‌కు రానున్నట్టు సమాచారం. త్వరలో స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ మూవీ శాటిలైట్ హక్కులను ఈటీవీ దక్కించుకుంది.

Also Read: One Man Five Women Preganant: వీడు మగాడ్రా బుజ్జి.. 22 ఏళ్లకే ఐదుగురు భార్యలు, ఒకేసారి తల్లులు కాబోతున్నారు

Also Read: Bike Buys with Coins: పూజారి "చిల్లర ప్రేమ" కథ వినండి.. వీరి ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News