'అంతరిక్షం'లో నటీనటుల పాత్రల గురించి ఒక్క ముక్కలో చెప్పే వీడియోలు

'అంతరిక్షం'లో వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య‌ త్రిపాఠి, అధితి రావు హైద‌రీల పాత్రల వీడియోలు

Last Updated : Dec 9, 2018, 05:29 PM IST
'అంతరిక్షం'లో నటీనటుల పాత్రల గురించి ఒక్క ముక్కలో చెప్పే వీడియోలు

ఘాజీ ఫేమ్ సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ తేజ్‌ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన సినిమా అంత‌రిక్షం. లావ‌ణ్య‌ త్రిపాఠి, అధితి రావు హైద‌రీ ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్స్ పోషస్తున్నారు. 9000 కెఎంపిహెచ్ అనే ట్యాగ్ లైన్‌తో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇవాళే విడుదలైంది. ట్రైలర్‌కి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన సైతం కనిపిస్తోంది.

అయితే అంతకన్నా ముందుగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన వరుణ్ తేజ్, లావ‌ణ్య‌ త్రిపాఠి, అధితి రావు హైద‌రీల పాత్రల తీరు తెన్నులను వివరిస్తూ చిత్ర నిర్మాతలు మూడు వీడియోలు విడుదల చేశారు. డిసెంబర్ 21న అంతరిక్షం విడుదల కానున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మేకర్స్ ఈ వీడియోలను విడుదల చేశారు.

ఆకట్టుకునే సైన్స్ ఫిక్షన్ కథనం, హాలీవుడ్ స్థాయి టేకింగ్‌తో తమ చిత్రాన్ని తెరకెక్కించామని అంతరిక్షం మేకర్స్ చెబుతున్నారు. ట్రాయ్, జీరో డార్క్, గేమ్ ఆప్ థ్రోన్స్ వంటి హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి పనిచేయడం మరో విశేషం. 

Trending News