Bhumana Karunakar Reddy Resigns: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ ఊహించని విధంగా పరాజయం పాలైంది. గత ఎన్నికల్లో ఏకంగా 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఈసారి కేవలం 10 స్థానాలకు అటు ఇటు ఉండడంతో రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టీడీపీ కూటమి 165 సీట్లలో విజయంతో తిరుగులేని మెజారిటీ దిశగా పయనిస్తోంది. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా గల్లంతయింది. 18 సీట్లకు ఇంకా 8 సీట్ల దూరంలోనే ఆగిపోయింది. గత ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ.. అద్భుతంగా పుంజుకుంది. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ స్థానాల్లో విజయం దిశగా దూసుకువెళ్తోంది. 100 శాతం స్ట్రైక్ రేట్‌తో పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో సత్తాచాటారు.
Also Read: Lok Sabha Election Results 2024: జీ న్యూస్ పక్కా లెక్క.. ఎగ్జిట్ పోల్స్ లో చెప్పిందే నిజమైంది..
ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోవడంపై ఆ పార్టీ నాయకులు తీవ్ర నిరాశలో కురుకుపోయారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ చైర్మన్ పదవికి మంగళవారం సాయంత్రం భూమన కరుణాకర రెడ్డి రాజీనామా చేశారు. గత ఆగస్టు నెలలో ఆయన టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. తన రాజీనామాను ఆమోదించమంటూ టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి భూమన కరుణాకర రెడ్డి లేఖ రాశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో 2006 నుంచి 2008 మధ్య కాలంలో టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.
ఈ ఎన్నికల్లో పోటీకి భూమన దూరంగా ఉన్నారు. ఆయన కుమారుడి భూమన అభినయ్‌కు తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఇప్పించుకున్నారు. అయితే బీజేపీ అభ్యర్థి చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు. వైసీపీ దారుణ ఓటమితో టీటీడీ చైర్మన్ పదవికి భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.
Also Read: CM YS Jagan: మంచి చేసిన ఓడిపోయాం.. ఎమోషనల్ అయిన సీఎం వైఎస్ జగన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter