Lok Sabha 2024 Elections Results 2024: రోజా, స్మృతి ఇరానీ, రాధిక సహా చిత్తు చిత్తుగా ఓడిన సినీ తారలు..

Lok Sabha 2024 Elections Results 2024: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పాటు..ఏపీలోని అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాల్లో పలువురు సినీ తారలు విజయం అందుకుంటే.. మరికొందరికి మాత్రం ఈ ఎన్నికలు చేదు ఫలితాలను మిగిల్చాయి.

1 /6

రోజా (Roja) వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత రోజా ఈ ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేసి తన సమీప టీడీపీ అభ్యర్ధి చేతిలో చిత్తుగా ఓడిపోయారు.

2 /6

రాధిక శరత్ కుమార్.. (Radhika Sarathkumar) రాధిక శరత్ కుమార్ బీజేపీ తరుపున తమిళనాడులోని విరుధ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి డీఎండీకే అభ్యర్ధి చేతిలో చిత్తుగా ఓడారు.

3 /6

స్మృతి ఇరానీ (Smriti Irani) కేంద్ర మంత్రి స్మృతి  యూపీలోని అమేఠీ నుంచి మూడోసారి ఎంపీగా పోటీ చేసింది. రెండో సారి ఆమెను గెలిపించిన ప్రజలు.. ఈ సారి మాత్రం కాంగ్రెస్ అభ్యర్ధి కిషోరి లాల్ శర్మ చేతిలో ఓడిపోయారు.

4 /6

లాకెట్ ఛటర్జీ.. (Locket Chatterjee) అనేక బెంగాలీ సినిమాల్లో నటించిన ప్రముఖ డాన్సర్‌గా పేరు పొందిన లాకెట్ ఛటర్జీ..బీజేపీ తరుపున పశ్చిమ బంగలోని హుగ్లీ స్థానం నుంచి బరిలో దిగి రచనా బెనర్జీ చేతిలో ఓటమి పాలైయ్యారు.

5 /6

  నవనీత్ కౌర్ రాణా.. (Navneet Kaur Rana) నవనీత్ కౌర్ రాణా గత ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి బీజేపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. 

6 /6

దినేష్ లాల్ యాదవ్ అలియాస్ నిరాహువా (Nirahua) భోజ్‌పురి నటుడు అయిన దినేష్ లాల్ యాదవ్ అలియాస్ నిరుహువా.. ఈ  సారి ఈయన ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌ లోక్ సభ నుంచి బీజేపీ తరుపున పోటీ చేసి తన  ప్రత్యర్ధి ఎస్పీ అభ్యర్ధి చేతిలో ఓటమి పాలయ్యారు.