Varudu Heroine Comments: మళ్లీ అల్లు అర్జున్‌తో నటిస్తా.. వరుడు హీరోయిన్‌ భానుశ్రీ

Bhanu Sri Mehra Wants to Act again With Allu Arjun: వరుడు సినిమా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే వస్తోంది. బన్నీ తనను బ్లాక్ చేశాడంటూ మొదలు పెట్టిన రచ్చతో భానుశ్రీ ఫేమస్ అయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో భాను శ్రీ ఏదో ఒకటి చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 5, 2023, 04:53 PM IST
  • నెట్టింట్లో వరుడు హీరోయిన్ సందడి
  • అభిమానులతో భాను శ్రీ చిట్ చాట్
  • మళ్లీ నటించాలని ఉందన్న భానుశ్రీ
Varudu Heroine Comments: మళ్లీ అల్లు అర్జున్‌తో నటిస్తా.. వరుడు హీరోయిన్‌ భానుశ్రీ

Bhanu Sri Mehra Wants to Act again With Allu Arjun: అల్లు అర్జున్ కెరీర్‌లో వరుడు సినిమా ప్రత్యేకంగా నిలుస్తుంది. గుణ శేఖర్ బన్నీ కాంబోలో వచ్చిన ఈ సినిమా మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక హీరోయిన్‌ను నేరుగా థియేటర్లలోనే చూపించడం, హీరోయిన్ ఎవరో తెలియకుండా జాగ్రత్తపడి, ఒకే సారి థియేటర్లో చూపించి సర్ ప్రైజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఆ హీరోయిన్‌ను చూసి జనాలు బెదిరిపోయారు. ఇంతలా ఊరించి ఇలాంటి హీరోయిన్‌ను పెట్టుకున్నారేంటని అనుకున్నారు.

అలా చివరకు వరుడు సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడానికి చాలానే కారణాలున్నాయి. ఆశిష్‌ విద్యార్థి, సుహాసినిల ఓవర్ యాక్షన్, గుణ శేఖర్ వేసిన నాసిరకం సెట్స్, గ్రాఫిక్స్ వర్క్ ఇలా ఎన్నో కారణాలున్నాయి. అయితే ముఖ్యంగా హీరోయిన్ భాను శ్రీ వల్లే ఈ సినిమా మీద అందరికీ ఇంట్రెస్ట్ పోయింది.

ఇక వరుడు హీరోయిన్ గత కొన్ని వారాలు మళ్లీ తెరపైకి వచ్చింది. అల్లు అర్జున్ తనను ట్విట్టర్‌లో బ్లాక్ చేశాడని స్క్రీన్ షాట్లను పెట్టడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. రచ్చ రచ్చ చేస్తోందని భావించిన బన్నీ.. మళ్లీ వెంటనే ఆమెను అన్ బ్లాక్ చేసినట్టుగా ఉన్నాడు. దీంతో మళ్లీ భాను శ్రీ.. తిరిగి సంబరపడిపోయింది. బన్నీ తనను అన్ బ్లాక్ చేశాడని, తాను ఎప్పటికీ బన్నీకి అభిమానినే అని చెప్పుకొచ్చింది.

తాజాగా భాను శ్రీ మెహ్రా.. ట్విట్టర్‌లో తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. రామ్ చరణ్‌ ఇష్టమా? బన్నీ ఇష్టమా? అని అడిగితే.. ఇద్దరూ ఇష్టమే కానీ.. బన్నీ డ్యాన్స్ మూమెంట్ అంటే ఇంకొంచెం ఎక్కువ ఇష్టమని చెప్పుకొచ్చింది. బన్నీతో మళ్లీ నటిస్తావా? అని అడిగితే.. నాకు రెక్కలు వచ్చి ఆకాశంలో ఎగిరినట్టు అనిపిస్తుంది.. ఒక వేళ మళ్లీ నటించే అవకాశం వస్తే నటిస్తాను.. ఏమో భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికీ తెలుసు అని అనేసింది.

Also Read: Dasara Collection : దసరా ఊచకోత.. అక్కడ కూడా బ్రేక్ ఈవెన్?.. నాని దెబ్బకు బాక్సాఫీస్ బద్దల్

Also Read: Janhvi Kapoor Pics : అందాలను ఒడిసిపట్టినట్టుగా.. కాక పుట్టించేలా జాన్వీ కపూర్ లుక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News