Varsha Bollama::‘బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నావురా’... జర్నలిస్టుకి అదిరిపోయే జవాబు ఇచ్చిన వర్ష బొల్లమ్మ

Oori Peru Bhairavakona: మిడిల్ క్లాస్ మెలోడీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ వర్ష బొల్లమ్మ. ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా చేసిన ఊరు పేరు భైరవకోన చిత్రంతో మన ముందుకు వచ్చిన ఈనాటి ఈ సినిమా ప్రెస్ మీట్ లో జర్నలిస్టుపై వేసిన కౌంటర్  తెగ వైరల్ అవుతుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 16, 2024, 09:40 AM IST
Varsha Bollama::‘బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నావురా’... జర్నలిస్టుకి అదిరిపోయే జవాబు ఇచ్చిన వర్ష బొల్లమ్మ

Varsha Bollama Counter to Journalist: ఆనంద్ దేవరకొండ హీరోగా చేసిన మిడిల్ క్లాస్ మెలోడీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చి.. మంచి సక్సెస్ సాధించిన హీరోయిన్ వర్ష బొల్లమ్మ. ఆ తరువాత కొన్ని వెబ్ సిరీస్ లో సైతం కనిపించిన ఈ నటి ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఊరి పేరు భైరవకోన చిత్రంలో హీరోయిన్  నటించింది. కాగా ఈ సినిమాలో వర్షా తో పాటు కావ్య తాపర్ మరో హీరోయిన్ గా కనిపించింది. ఈ సినిమా ప్రీమియర్స్ మొన్న బుధవారం రాత్రి జరగగా.. సినిమాకి మంచి టాక్ తో పాటు ప్రీమియర్స్ కి మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో నిన్న సినిమా యూనిట్ ప్రెస్ మీట్ అరేంజ్ చేయగా…ఈ మీడియా ఇంటరాక్షన్ లో వర్షా తన తోటి హీరోయిన్ కావ్యాన్ని సపోర్ట్ చేస్తూ ఒక జర్నలిస్ట్ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

ఓ జర్నలిస్ట్, కావ్య తాపర్‌తో.. “ఇటీవల రిలీజైన ఈగల్ మూవీ ఈవెంట్స్‌లో, అలా అని ఇప్పుడు భైరవకోన ఈవెంట్స్‌లో మీరు అందమైన డ్రస్సులు వేసుకుంటూ.. హాట్‌గా కనిపిస్తున్నారు. మీరు ఇలా చేయడం వెనుక ఏమైనా స్ట్రాటిజి ఉందా” అంటూ అడగగా దానికి సూపర్ సెటైర్ వర్ష.

జర్నలిస్ట్ అడిగిన ఈ ప్రశ్నకు కావ్య తాపర్ కొంచెం ఇబ్బంది పడినట్లే కనిపించారు. అయితే ఆ ప్రశ్న అడగగానే వెంటనే వర్ష మైక్ తీసుకోని… “మీరు అడిగిన ప్రశ్న విన్న తరువాత, ఈమధ్య కాలంలో ఇన్‌స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్న ఓ డైలాగ్ గుర్తుకు వస్తుంది. ఆ డైలాగ్ ఏంటంటే.. ‘బాగానే ఎక్స్‌ట్రాలు చేస్తున్నావురా’ అనేది గుర్తుకు వస్తుంది” అంటూ సూపర్ కౌంటర్ ఇచ్చింది. ఇలా తన తోటి హీరోయిన్ ని సపోర్ట్ చేస్తూ ఈ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి.

 

కాగా ‘ఊరి పేరు భైరవకోన’ సినిమా విషయానికి వస్తే.. సోషియో ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని వీఐ ఆనంద్ డైరెక్ట్ చేసారు. ట్రైలర్ అండ్ టీజర్ బాగా ఆకట్టుకోవడంతో.. సినిమా ప్రీమియర్స్ తోనే కోటికి పైగా కలెక్షన్స్ ని అందుకొని సందీప్ కెరియర్ లో బెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది.

Read More: Vijay Devarakonda - Family Star: విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మూవీ ఫస్ట్ సింగిల్‌కు సూపర్ రెస్పాన్స్..

Read More: Praveen IPS: విడుదలైన ప్రవీణ్ ఐపిఎస్ ట్రైలర్.. ఫిబ్రవరి 16న థియేటర్స్ లో సందడి చేయనున్న సినిమా..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News