Urvashi Rautela Craze: నక్క తోక తొక్కిన ఊర్వశి రౌతేలా.. ఏకంగా చిరుతో స్పెషల్ సాంగ్!

Urvashi Rautela special song: ఇప్పటికే టాలీవుడ్లో రామ్ హీరోగా బోయపాటి చేసున్న సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన ఊర్వశి రౌతేలా ఇప్పుడు మెగాస్టార్ సరసన కాలు కదిపినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 4, 2022, 06:23 AM IST
Urvashi Rautela Craze: నక్క తోక తొక్కిన ఊర్వశి రౌతేలా.. ఏకంగా చిరుతో స్పెషల్ సాంగ్!

Urvashi Rautela special song in Chiranjeevi Raviteja Waltair Veerayya: బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. క్రికెటర్ రిషబ్ పంత్ తో ఆమె ఏదో ప్రేమ వ్యవహారం నడుపుతోంది అని అనుమానం వచ్చేలాగా పలు పోస్టులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా మారుతుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రిషబ్ పంత్ అని అర్థం వచ్చేలా ఆర్పీ పేరుతో రకరకాల పోస్టులు పెడుతూ అటు రిషబ్ పంత్ అభిమానులకు తన అభిమానులకు కూడా నిద్ర లేకుండా చేస్తుంది.

చేస్తున్న సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా హాట్ టాపిక్ అవుతూ ఉండే ఆమె ఇప్పుడు టాలీవుడ్లో ఒక ఐటెం సాంగ్ చేసింది. ఆ తరువాత ఈ భామకు ఇప్పుడు టాలీవుడ్ లో వరుస ఆఫర్లు రావడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బోయపాటి శ్రీను రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ సినిమాలో ఆమె ఒక ఐటెం సాంగ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇప్పుడు ఆమె తెలుగులో మరో ఐటెం సాంగ్ కూడా చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

ఆ సినిమా మరేమిటో కాదు వాల్తేరు వీరయ్య అని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్ లో వాల్తేరు వీరయ్య అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా ఒక ఐటెం సాంగ్ లో మెరవబోతోందని టాక్ వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలయ్యేందుకు రంగం సిద్ధమైంది. జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె ఒక ఐటెం సాంగ్ చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు రవితేజ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మొత్తం మీద ఊర్వశి రౌతేలా ఇప్పుడు తెలుగు వారికి మోస్ట్ వాంటెడ్ ఐటమ్ గర్ల్ గా మారబోతుందని అంటున్నారు. చూడాలి మరి అది ఎంతవరకు నిజమవుతుంది అనేది. 

Also Read: Pawan Kalyan Murder Conspiracy: పవన్ హత్యకు కుట్ర..250 కోట్ల సుపారీ... ఆరోజే స్కెచ్చేశారు కానీ జస్ట్ లో మిస్?

Also Read: Anudeep's demand : మార్కెట్లో అతని క్రేజ్ చూస్తే మెంటలే.. మామూలు జాతి రత్నం కాదుగా.. ఏకంగా ఆ హీరోతో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News