Urvashi in Waltair Veerayya: ఐటెం భామ కాదండోయ్..వాల్తేరు వీరయ్యతో ఊర్వశి పెద్ద ప్లానే వేసిందట!

Urvashi Rautela in Waltair Veerayya: ఊర్వశి రౌతేలా వాల్తేరు వీరయ్య అనే సినిమాలో స్పెషల్ నంబర్ చేస్తుందని ముందు నుంచి టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయితే ఇప్పుడు మరో వార్త తెర మీదకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే 

Last Updated : Nov 12, 2022, 05:45 PM IST
Urvashi in Waltair Veerayya: ఐటెం భామ కాదండోయ్..వాల్తేరు వీరయ్యతో ఊర్వశి పెద్ద ప్లానే వేసిందట!

Urvashi Rautela Playing a Navy Officer Role in Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. చివరిగా గాడ్ ఫాదర్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమాతో ఒక మాదిరి హిట్ అందుకున్నారు. కలెక్షన్స్ విషయంలో కాస్త సందిగ్ధత నెలకొన్నా సరే ఆ విషయం పక్కన పెడితే ప్రేక్షకులందరినీ మాత్రం ఆ సినిమా ఆకట్టుకుంది. ప్రస్తుతానికి ఆయన బాబీ డైరెక్షన్లో ఈ వాల్తేరు వీరయ్య అనే సినిమా చేస్తున్నారు.

మాస్ మహారాజా రవితేజ మరో పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. పూర్తిస్థాయిలో విశాఖపట్నం నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక జాలరి పాత్రలో కనిపించబోతున్నాడని ముందు నుంచి టాక్ వినిపిస్తోంది. దానికి తగినట్లుగానే సినిమా నుంచి విడుదలైన కొన్ని లుక్స్ అలాగే ఒక చిన్న వీడియో కూడా మెగాస్టార్ చిరంజీవి ఒక జాలరి లాగానే కనిపిస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ చేస్తుందని గతంలో వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత ఇటీవల మెహర్ రమేష్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా కూడా కొన్ని ఫోటోలు బయటకు రాగా అందులో కూడా ఊర్వశీ రౌతేలా కనిపించింది. అక్కడ ఉన్న జనాన్ని బట్టి అది ఐటమ్ సాంగ్ అని అందరూ భావించారు. కానీ ఈ సినిమాలో ఆమె ఐటెం సాంగ్ చేయడం మాత్రమే కాదు ఒక కీలక పాత్రలో కూడా నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఆమె ఒక నేవీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుందని తెలుస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించిన ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఇప్పటికే జరిగిపోయిందని ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా హక్కులు 95 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయినట్టు చెబుతున్నారు. థియేట్రికల్ బిజినెస్ తోపాటు శాటిలైట్ అలాగే ఓటీటీ బిజినెస్ కూడా గట్టిగానే ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.  సంక్రాంతి సీజన్ లో ఈ సినిమాని వీర సింహా రెడ్డి సినిమా కంటే ముందు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి చూడాలి ఏం జరగబోతుంది అనేది .
Also Read: Chiru Vs Balayya: అన్ని విషయాల్లో బాలయ్యను డామినేట్ చేస్తున్న చిరు.. ఆ దెబ్బతో సినిమా కూడా ముందే?

Also Read: Rajinikanth: లవ్ టుడే హీరోకి రజనీ ప్రసంశలు.. గాల్లో తేలిపోతున్న ప్రదీప్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News